బాహుబలి ఖాతాలో మరో అరుదైన రికార్డు⚔

  |   Tollywood

జక్కన్న చెక్కిన ‘బాహుబలి’ ఇంటా బయటా రచ్చ చేసింది. విడుదలై రెండేళ్లు కావొస్తోన్న ఏదో ఒక రూపంటో ‘బాహుబలి’ రికార్డుల మోత మోగిస్తూనే ఉంది. జానపద కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా భారతీయ చిత్ర పరిశ్రమలో అన్ని రికార్డులను తిరగ రాసింది. ఇప్పటికీ ‘బాహుబలి’ క్రియేట్ చేసిన రికార్డులను ఏ సినిమా క్రాస్ చేయలేకపోయింది.

తాాజాగా ‘బాహుబలి’ సినిమా మరో అరుదైన రికార్డును సొంత చేసుకుంది. ఓర్మాక్స్ మీడియా విడుదల చేసిన ఉత్తమ చిత్రాల లిష్టులో బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచింది.

ఓర్మాక్స్ అనే సంస్థ గత పదేళ్ల నుంచి దేశంలోని అత్యుత్తమ చిత్రాల లిస్టు‌ను ప్రిపేర్ చేస్తోంది. థియేటర్స్ వద్ద ప్రేక్షకుల అభిప్రాయాలు, వాళ్ల ఇష్టాఇస్టాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఈ జాబితాను రూపొందిస్తూ వస్తున్నారు. ప్రతి ఏడాది హిందీలో విడుదలయ్యే చిత్రాలతో పాటు ప్రేక్షకులను ఎక్కువగా ఇంప్రెస్ చేసిన చిత్రాలతో ఈ జాబితాను విడుదల చేస్తూ ఉంటుంది. తాజాగా పదేళ్లలో ప్రేక్షకులు ఎక్కువ ఇష్టపడ్డ పది చిత్రాల జాబితాను ఓర్మాక్స్ సంస్థ విడుదల చేసింది.

ఒర్మాక్స్ విడుదల చేసిన ఈ జాబితాలో 90 పాయింట్లతో ‘3 ఇడియట్స్’ ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది. 85 పాయింట్లతో ‘బాహుబలి 2’ రెండో ప్లేస్..83 పాయింట్లతో ‘బాహుబలి 1’ మూడో స్థానంలో నిలిచింది.

పూర్తి ఆర్టికల్ ఇక్కడ చూడండి-http://v.duta.us/zVOItwAA

📲 Get Tollywood on Whatsapp 💬