రాహుల్‌‌తో చంద్రబాబు భేటీ..బీజేపీ వ్యతిరేక పక్షాల భేటీ వాయిదా..కారణమేంటి?🤝

  |   Telugunews

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని కలిశారు. రాహుల్ నివాసానికి వెళ్లిన చంద్రబాబు...ఆయనతో అరగంట పాటు చర్చలు జరిపారు. సమావేశంలో బీజేపీయేతర కూటమి ఏర్పాటుపైనే ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. కోల్‌కతాలో జరిగిన విపక్ష పార్టీల ర్యాలీ విజయవంతంపైనా చర్చించారు. ఇక అమరావతిలో జరగబోయే విపక్షాల సమావేశంపైనా మంతనాలు జరిపినట్లు సమాచారం.

అంతకు ముందు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగొయ్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి లావు నాగేశ్వరరావుని కలిసి ఏపీ హైకోర్టు భవనం ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. ఫిబ్రవరి 3న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేతుల మీదుగా హైకోర్టును ప్రారంభించనున్నారు.

ఇక బుధవారం ఢిల్లీలో జరగాల్సిన బీజేపీ వ్యతిరేక పక్షాల భేటీ వాయిదాపడింది. పలువురు నేతలు అందుబాటులో లేకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేశారు. దాంతో రాహుల్‌తో భేటీ అనంతరం చంద్రబాబు తిరుగు ప్రయాణమయ్యారు. ఢిల్లీ నుంచి నేరుగా అమరావతికి బయలుదేరారు.

పూర్తి ఆర్టికల్ ఇక్కడ చూడండి -http://v.duta.us/7G_8dgAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬