వైసీపీ, బీజేపీ.. కులాల్లో చిచ్చుపెట్టాలని చూస్తున్నాయ్ ! 🥵

  |   Telugunews

కేంద్రం తీసుకొచ్చిన అగ్రకులాల పేదలకి 10శాతం రిజర్వేషన్ ని ఏపీ సీఎం చంద్రబాబు తనకు అనుకూలంగా మార్చుకున్న సంగతి తెలిసిందే. ఈడబ్ల్యుఎస్ 10% రిజర్వేషన్లలో కాపులకు 5% ఇచ్చారు. ఐతే, కాపు రిజర్వేషన్లను బీజేపీ, వైసీపీ నేతలు వక్రీకరించడంపై చంద్రబాబు మండిపడ్డారు.

బుధవారం సీఎం చంద్రబాబు టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కాపు రిజ్వేషన్ల విషయంలో ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టాలని నేతలకి సూచించారు. అగ్రకులాల్లో కాపులు సగంపైగా ఉన్నారని, కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల శాతమే అధికమని, అందుకే ఈడబ్ల్యుఎస్ 10% రిజర్వేషన్లలో కాపులకు 5% ఇచ్చామని ఆయన స్పష్టం చేశారు. కులాల్లో చిచ్చుపెట్టాలని వైసీపీ, బీజేపీ లు కుట్ర చేస్తున్నాయి విమర్శించారు.

పూర్తి ఆర్టికల్ ఇక్కడ చూడండి -http://v.duta.us/ISpTcQAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬