రైతన్నకు జగనన్న భరోసా

  |   Telugunews

తుని : రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా రైతాంగానికి ఆర్థికంగా చేయూతని అందిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోతుకూరు వెంకటేష్ అన్నారు. మంగళవారం స్థానిక సాయి వేదిక లో వైసీపీ నేతలు జ్యోతి ప్రజ్వలన చేసి రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. రైతు భరోసా క్రింద ఎంపికైన రైతులకు భరోసా పత్రాలతో అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మోతుకూరు వెంకటేష్ మాట్లాడుతూ ప్రజా సంకల్ప యాత్రలో రాష్ట్ర రైతాంగానికి జగన్ ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా ను అందిస్తున్నారు అన్నారు. రైతు భరోసా పథకం కింద ఏటా 12,500 రూపాయలు రైతుకు పెట్టుబడి సాయం కింద అందిస్తామని ప్రకటించిన ప్రభుత్వం, మరో వెయ్యి రూపాయలు పెంచి, 13,500 రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఐదేళ్లపాటు ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ రైతు పక్షపాతి అని, రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని స్పష్టం చేశారు. ఇక నుంచి వ్యవసాయం లాభసాటిగా మారుతుందని, రైతేరాజు అన్న విషయాన్ని సమాజానికి చాటి చెప్పేందుకు ముఖ్యమంత్రి జగన్ కంకణం కట్టుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రేలంగి రమణ గౌడ్, పోతల రమణ, కొయ్య శ్రీను, పోతుల లక్ష్మణ్, పెద్దపాటి అమ్మాజీ, ఎస్.కె. క్వాజా, జి.రామచంద్ర రావు, చోడిశెట్టి సోమరాజు, స్పెషలాఫీసర్ ప్రభాకరరావు వ్యవసాయ శాఖ ఏ డి ఏ సుంకర బుల్లిబాబు, వివో లు అరుణ్ కుమార్, వాణి, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు .

ఫోటో - http://v.duta.us/54YGVgAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/VJbKAwAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬