రాష్ట్ర స్థాయి సపక్ తక్రా పోటీలకు విద్యార్థులు ఎంపిక

  |   Telugunews

అంబాజీపేట : రాష్ట్రస్థాయి సపక్ తక్రా పోటీలకు స్థానిక హైస్కూల్ కు చెందిన 9 మంది విద్యార్థులు ఎంపికైనట్లు హై స్కూల్ హెచ్.ఎం బీర హనుమంతరావు తెలిపారు. కాకినాడలో సోమవారం నిర్వహించిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలలో అండర్ 14, అండర్ 17 విద్యార్థులు తొమ్మిది మంది పాల్గొని రాష్ట్ర స్థాయి కి అర్హత సాధించారన్నారు. వీరిలో అండర్ 14 బాలికలు బొంతు నిహారిక,గుబ్బల లక్ష్మి ప్రియాంక,దంగేటి శిరీష ,బాలుర విభాగంలో ఈతకోట అజయ్ రత్న గిరి వాసు, అండర్ 17 బాలుర విభాగంలో యెర్రా సాయి గోపాల్,పెదపూడి లోకేష్ బాలికల విభాగంలో ఈతకోట శ్రావణి,సంధ్య,కోసూరి లక్ష్మీ ప్రసన్న,రాష్ట్ర స్థాయికి సాధించారని హెచ్.ఎం.వివరించారు. వీరు త్వరలో కృష్ణా జిల్లా మరియు పశ్చిమగోదావరి జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని హనుమంతరావు తెలిపారు.రాష్ట్ర స్థాయికి ఎంపీకైన విద్యార్థులను ,వీరికి శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయిని అందే సూర్య కుమారిని హెచ్.ఎం. హనుమంత రావు, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ మర్ల లక్ష్మీ పద్మజ సంతోషి కుమారి,అస్వా చైర్మన్ కామిశెట్టి మధుబాబు, వ్యాయామ ఉపాధ్యాయుడు అందే సూర్యనారాయణ ,ఇతర సిబ్బంది అభినందనలు తెలిపారు.

ఫోటో - http://v.duta.us/rfwCMwAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/fp5L2gAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬