19 న జాబ్ మేళా - నిరుద్యోగ యువతులకు ఉద్యోగ అవకాశాలు

  |   Telugunews

గాలివీడు : జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఉపాధికల్పన-వ్యవస్థాపక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు వెలుగు ఏపీఎం సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికావిలేకరులతో మాట్లాడుతూ మొబైల్ అసెంబ్లర్ ఉద్యోగానికి గాను పది,ఇంటర్,డిగ్రీ చదివి 18 నుండి 26 సంవత్సరాల అవివాహిత నిరుద్యోగ యువతులు అర్హులన్నారు. వారికి శిక్షణతో నిమిత్తం లేకుండా రైజింగ్ స్టార్ మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉద్యోగాల కొరకు మండలంలోని ఔత్సాహిక యువతులు అక్టోబర్ 19 వ తేదీ శనివారం నాడు ఉదయం 10 గంటలకు రాయచోటిలోని రాజుల కాలనీ ఐ సి డి ఎస్ భవనం, వెలుగు కార్యాలయం వద్ద ఇంటర్వ్యూలకు విద్యార్హత సర్టిఫికెట్లు,ఆధార్ కార్డు,బ్యాంకు అకౌంట్,ఒరిజినల్ , జిరాక్స్ కాపీలు,3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో హాజరుకావాలన్నారు.ఎంపికైన వారికి నెలకు 10,600 వేతనంతో పాటు పీఎఫ్,ఈఎస్ ఐ, ఓటి, షిఫ్ట్ ఆలవెన్స్,నెలనెలా అటెండెన్స్ బోనస్ రూ.1000 మరియు ఉచిత వసతి భోజన సదుపాయం కల్పించడం జరుగుతుందన్నారు.సందేహాలకు 9398385471, 9704695549 సెల్ నంబర్లలో సంప్రదించాలన్నారు.

ఫోటో - http://v.duta.us/UgIIHAAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/4l2QGwAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬