ఆరోగ్యకర జీవనానికి కల్తీ లేని ఆహారం

  |   Telugunews

శ్రీకాకుళం : ఆరోగ్యకర జీవనానికి కల్తీ లేని ఆహారం ఆవశ్యకమని జిల్లా పౌర సరఫరాల అధికారి జి. నాగేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ప్రపంచ ఆహార దినోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి డి.ఎస్.ఓ. ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కల్తీలేని మంచి ఆహారమే దివ్య ఔషధమని అన్నారు. కల్తీ ఆహారాన్ని తీసుకోవడం ద్వారా శరీరంలోని అవయవాలు దెబ్బతింటాయన్నారు. ప్రస్తుతం గాలి, నీరు సైతం కాలుష్యంతో నిండి వున్నాయన్నారు. నిబధ్ధతతోను, నిజాయితీతోను, కల్తీ లేని ఆహార పదార్ధాలను అందించాలని వర్తక సంఘాలకు పిలుపునిచ్చారు. కల్తీ చేసిన ఆహార పదార్ధాలను అమ్మినవారిని ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందన్నారు. స్వఛ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు పూర్తి అవగాహనతో ప్రజలను చైతన్య పరచాలన్నారు. ఒక సారి వాడిన నూనెలను మరొకసారి వాడడం ద్వారా కేన్సర్ వ్యాధి వస్తుందన్నారు. జిల్లా ఆరోగ్య భద్రతాధికారి కె.కూర్మనాయకులు మాట్లాడుతూ, 2030 సంవత్సరం నాటికి అందరికీ ఆహారాన్ని అందించాలనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యమని, ప్రపంచంలో సుమారు 80 కోట్ల మంది ప్రజలకు ఆహారం అందని పరిస్థితి వున్నదని తెలిపారు. ప్రతీ 5గురిలో 4 గురికి మాత్రమే పౌష్టికాహారం దొరుకుతున్నదని తెలిపారు. పెళ్ళిళ్ళు వంటి వేడుకలలో ఎక్కువగా ఆహార పదార్ధాలు మిగిలిపోతుంటాయని, వాటిని అనాధ శరణాలయాలకు అందించాలని చెప్పారు. అన్ని దానాలలోను అన్నదానమే గొప్పదని చెప్పారు. వర్తకులంతా రంగులు వేసిన ఆహారపదార్ధాలను అమ్మరాదని, తయారు చేసిన తేదీ, ఎక్సపైరీ తేదీలు వున్న ఆహార పదార్ధాలను మాత్రమే అమ్మకం జరపాలన్నారు. లేనిచో వారిపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు....

ఫోటో - http://v.duta.us/5AHIJgAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/r5b5EgAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬