ఉప రాష్ట్రపతి ఇంట్లో... సైరా స్పెషల్ షో!

  |   Tollywood

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన మెగా మూవీ సైరా నరసింహారెడ్డి. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కిన ఈ సినిమా గాంధీ జయంతి సందర్భంగా రిలీజ్‌ అయి ఘనవిజయం సాధించింది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్‌ అయిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది.

సినిమాను భారీగా ప్రమోట్‌ చేస్తున్న చిత్రయూనిట్‌ తాజాగా ఢిల్లీలో స్పెషల్‌ షోకు ఏర్పాట్లు చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కలిసి మెగాస్టార్‌ చిరంజీవి ఆయన ఇంట్లోనే స్పెషల్ షోకు ఏర్పాట్లుచేశారు. వెంకయ్య నాయుడుతో కలిసి చిరు కూడా సినిమాను వీక్షించనున్నారు.

Also Read:

అంతేకాదు ప్రధాని నరేంద్రమోదితో పాటు అమిత్‌ షాను కూడా ఈ షోకు ఆహ్వానించనున్నారని తెలుస్తోంది. అయితే షో ఎప్పుడు ఏర్పాటు చేయనున్నారు, ఎవరెవరు హాజరు కానున్నారు అన్న విషయాల్లో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. చిరు ఢిల్లీ పర్యటనలో ఆయనతో పాటు పలువురు బీజేపీ అగ్రనేతలు కూడా పాల్గొనటం ప్రాధాన్యత సంతరించుకుంది....

ఫోటో - http://v.duta.us/NQHtcQAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/1oHx6gAA

📲 Get Tollywood on Whatsapp 💬