ఐరన్‌ మ్యాన్‌గా బాలయ్య.. కథ లేకుండానే టైటిల్ ఫిక్స్‌!

  |   Tollywood

మాస్‌ హీరోగా తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న బాలయ్య .. తన సినిమాలతోనే కాదు, తన విలక్షణ వ్యక్తిత్వం తోనూ ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. బాలయ్య తన అభిమానుల మీద చేయి చేసుకున్న వీడియోలు ఎక్కువగా వైరల్‌ అవుతుంటాయి. అదే స్థాయిలో బాలయ్య మంచి తనం గురించి పలువురు సినీ ప్రముఖులు గుర్తు చేసుకున్న సందర్భాలు కూడా అదే స్థాయిలో వైరల్‌ అవుతుంటాయి.

తాజాగా బాలయ్య గురించి మరో ఇంట్రస్టింగ్‌ వీడియో ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రవిబాబు ఈటీవీలో ప్రసారం అయ్యే ఆలీతో జాలీగా కార్యక్రమానికి అతిథిగా వచ్చాడు. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న తన సినిమా ఆవిరి ప్రమోషన్‌లో భాగంగా ఈ కార్యక్రమానికి వచ్చిన రవిబాబు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు రవిబాబు.

Also Read:

బాలకృష్ణ ఎప్పుడు కలిసినా అందరితో సినిమాలు చేస్తావు మరి నాతో ఎప్పుడు చేస్తావని అడుగుతుంటారని, గౌతమీ పుత్ర శాతకర్ణి లాంటి బిగ్‌ హిట్‌ తరువాత కూడా ఫోన్‌ చేసి ఎప్పుడు కలిసి సినిమా చేద్దాం అని అడిగారని తెలిపాడు. అంతేకాదు బాలకృష్ణతో మీ సినిమా డైరెక్ట్ చేయటం నాకు గౌరవం అంటే.. బాలయ్య కూడా మీ డైరెక్షన్‌లో నటించటం నాకు గౌరవం అన్నారని గుర్తు చేసుకున్నాడు....

ఫోటో - http://v.duta.us/StWKoQAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/Qx1xxgAA

📲 Get Tollywood on Whatsapp 💬