కేంద్రప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వామపక్షాల రాస్తారోకో

  |   Telugunews

మార్కాపురంరూలర్‌, : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పోరేట్‌ విధానాల వలన తీవ్రమైన ఆర్థికసంక్షోభం నెలకొందని వామపక్షపార్టీల నాయకులు పేర్కొన్నారు. బిజెపి ప్రభుత్వం కార్పోరేట్‌ విధానాలు పాటిస్తూ సామాన్య, మధ్యతరగతి ప్రజలపై మోపుతున్న భారాలకు నిరసనగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆందోళనలలో భాగంగా సోమవారం సిపియం నాయకులు డికెయం రఫి అధ్యక్షతన పట్టణంలోని సిపిఐ కార్యాలయం నుండి నిరసన ర్యాలీ నిర్వహించి, అనంతరం కోర్టు సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సంధర్భంగా సిపియం మార్కాపురం ప్రాంత కార్యదర్శులు డి.సోమయ్య, అందె నాసరయ్యలు మాట్లాడుతూ ప్రస్తుతం నెలకొన్న తీవ్రసంక్షోభం ఫలితంగా అనేక ఆటోమొబైల్‌ పరిశ్రమలు, బిస్కెట్‌ పరిశ్రమలు, చిన్నతరహా పరిశ్రమలు మూసివేయడం జరిగిందని ఫలితంగా లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోవడంతో పాటు ప్రజల కొనుగోలు శక్తి పడిపోయి అన్ని రంగాల వ్యాపారులపై ఈ ప్రభావం తీవ్రంగా ఉందని ఫలితంగా సంక్షోభం ముదురుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కేంద్రప్రభుత్వం ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఏప్రయత్నమూ చేయడం లేదని, రోగం ఒకటైతే మందు మరోలా కేంద్రప్రభుత్వ చర్యలు ఉన్నాయన్నారు. ప్రభుత్వరంగ సంస్థలైన ఎల్‌ఐసి, బిఎస్‌ఎన్‌ఎల్‌, పోస్టల్‌, రైల్వే, రక్షణరంగాలను కారుచౌకగా కార్పోరేట్‌ శ క్తులకు అప్పగించడం జరుగుతోందన్నారు. ఈ చర్యలు సంక్షోభాన్ని పరిష్కరించకపోగా మరింత తీవ్రం చేసేలా ఉన్నాయన్నారు. సంక్షోభాన్ని పరిష్కరించేందుకు, ప్రజల కొనుగోలు శక్తి పెంచేందుకు పెద్ద ఎత్తున ఉద్యోగిత కల్పన చర్యలు చేపట్టాలని, ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలుచేసి రోజు కూలీ 500 రూ.లకు పెం చాలని, ప్రభుత్వ ఖర్చును పెంచడం ద్వారా ప్రజల కొనుగోల శక్తి పెరుగుతుందని తద్వారా సంక్షోభాన్ని నివారించవచ్చని ప్రముఖ ఆర్థికవేత్తలు తెలియజేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సిపియం నాయకులు రూబేను, కళావతి, వై. సురేష్‌కుమార్‌, విజయ్‌, నాగరాజు, కాశయ్య, రవికుమార్‌, మల్లికార్జున, సిపిఐ నాయకులు ఎస్‌కె ఖాశిం, పెద్దన్న, కాశయ్య, హరి, రోజా, మురళి తదితరులు పాల్గొన్నారు.

ఫోటో - http://v.duta.us/1RbarQAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/A0fa2wAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬