'టెర్మినేటర్: డార్క్ ఫేట్' తెలుగు ట్రైలర్.. యాక్షన్ పీక్స్

  |   Tollywood

హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ స్క్వార్జ్‌నెగ్గర్ పేరు చెప్పగానే మనకు 'టెర్మినేటర్' సినిమా గుర్తొస్తుంది. ఆర్నాల్డ్ భారీ దేహం, ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే యాక్షన్ సీక్సెన్సులు, మైమరపించే కంప్యూటర్ గ్రాఫిక్స్ ఇలా ఈ సినిమాల్లో ప్రతీది ప్రత్యేకమే. 'టెర్మినేటర్' సిరీస్‌లో ఇప్పుడు ఆరో సినిమా వస్తోంది. దీనికి 'టెర్మినేటర్: డార్క్ ఫేట్' అని టైటిల్ పెట్టారు. ఈ సినిమాతో తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ విడుదలవుతోంది.

ఈ సినిమాలో లిండా హామిల్టన్, ఆర్నాల్డ్ స్క్వార్జ్‌నెగ్గర్ ప్రధాన పాత్రల్లో నటించారు. 'డెడ్‌పూల్' ఫేమ్ టిమ్ మిల్లర్ దర్శకత్వం వహించారు. ప్రముఖ ఫిల్మ్‌మేకర్ జేమ్స్ కామెరన్, డేవిడ్ ఎల్లిసన్ సంయుక్తంగా నిర్మించారు. 'టెర్మినేటర్ 2: జడ్జ్‌మెంట్ డే'కు డైరెక్ట్ సీక్వెల్ ఈ సినిమా. నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర తెలుగు ట్రైలర్‌ను బుధవారం విడుదల చేశారు. సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ఈ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.

Also Read:...

ఫోటో - http://v.duta.us/FfkNTwAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/_WmYWQAA

📲 Get Tollywood on Whatsapp 💬