త‌మ్ముళ్లు స‌క్సెస్ అయ్యాకే డ్రెస్సింగ్‌ మారుస్తా: ఓంకార్‌

  |   Tollywood

రాజుగారి గది, రాజుగారి గది 2 సినిమాలతో మంచి విజయాలు సాధించిన దర్శక నిర్మాత ఓంకార్‌, ఈ శుక్రవారం రాజుగారి గది 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అశ్విన్‌బాబు, అవికా గోర్‌ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్‌ కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా దర్శక నిర్మాత ఓంకార్‌ మాట్లాడుతూ... `మరో రెండు రోజుల్లో మా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకంతో ఉంది. ఈ సినిమా ఇంత తక్కువ టైంలో పూర్తి చేయగలిగాం అంటే టెక్నికల్‌ టీం వల్లే అది సాధ్యమైంది. అశ్విన్‌, కళ్యాణ్ నా తమ్ముళ్లు. ఇద్దరు నన్ను నమ్ముకొని నాతో ఉన్నారు.

Also Read:

అశ్విన్‌ని హీరోని, కళ్యాణ్‌ని ప్రొడ్యూసర్‌ చేయాలన్నది నా కోరిక. వాళ్లకు నేను తప్ప ఎవరూ లేరు. నాన్నగారూ లాస్ట్ ఇయర్‌ పోయారు. అప్పటి నుంచి నేను వైట్‌ డ్రస్‌లో ఉంటున్నాను. తమ్ముళ్లిద్దరికీ సక్సెస్‌ ఇచ్చిన తరువాతే డ్రెస్సింగ్‌ మారుస్తా. సినిమాటోగ్రాఫర్‌ చోటాకె నాయుడు అన్న మా ఫ్యామిలీ మెంబర్‌లా సపోర్ట్ చేశారు. అంత పెద్ద డీఓపీ అయినా ఇప్పటికీ ఈ సినిమా కోసం ఆయన రెమ్యూనరేషన్‌ ఎంతో మాట్లాడలేదు` అన్నారు....

ఫోటో - http://v.duta.us/2MTeNwAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/iKa0NQAA

📲 Get Tollywood on Whatsapp 💬