దెబ్బతిన్న గృహాలను పరిశీలించిన ఓఎన్జీసీ అధికారుల బృందం

  |   Telugunews

‌మామిడికుదురు : కొమరాడ గ్రామంలోని ఓఎన్జీసీ డ్రిల్ల్ సైట్ లో 2007 సంవత్సరం లో పెట్రోలు ఉత్పత్తుల తవ్వకాల్లో(డ్రిల్లింగ్) వల్ల నష్టపోయిన 25 గృహాలను బుధవారం రాజమండ్రి ఓఎన్జీసీ బృందంలో అధికారులు పరిశీలించారు. అప్పట్లో డ్రిల్లింగ్ సైట్ లో చేపట్టిన బాంబింగ్ పనుల వల్ల సమీపంలో ఉన్న గృహలు దెబ్బతినడంతో స్థానికులు ధర్నాలు చేపట్టి అధికారులు కు వినతిపత్రాన్ని అందించారు. చమురు సంస్థలు కార్యకలాపాలు వల్ల నష్టపోయిన తమను ఆదుకోవాలని న్యాయం చేయాలని పలుమార్లు స్థానికులు రాజమండ్రిలో రీజనల్ ఆఫీసులో వినతిపత్రాన్ని అందించారు. ఎట్టకేలకు స్పందించిన ఓఎన్జీసీ అధికారులు కోమరాడ గ్రామంలో పర్యటించి ,స్థానికులు ను కలిసి వారితో చర్చించి అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఓఎన్జీసీ సైట్ ను పరిశీలించారు.పర్యటన బృందానికి స్థానిక నాయకుడు కొడమంచిలి సాయి కుమార్ జరిగిన నష్టాన్ని వివరించారు.ఇచ్చిన హామీ అమలుకాకపోతే తమ ఆవేదనను ఉద్యమ రూపంలో చూపిస్తామని తేల్చిచెప్పారు. పర్యటన బృందంలో ఓఎన్జీసీ జీఎం జి .శ్రీనివాస్,తాటిపాక జీసీఎస్ జీఎం టి.శ్రీనివాస్,ఎచ్ ఆర్ ల్యాండ్ ఈక్విజషన్ జీఎం ఎమ్.శ్రీనివాస్, డ్రిల్లింగ్ జీఎం ఎంబీ. ఖాన్, సివిల్ ఇంజినీర్ లక్ష్మీ రామ్, బి శ్రీధర్ రావు లు ఉన్నారు. ఈ బృందంతో పాటు స్థానిక భాదితులు లూటుకుర్తి గోవిందు, కోటా బ్రహ్మానందం, చిల్లే సత్యన్నారాయణ, సిర్రా కోటయ్య, మల్లవరపు ప్రసాద్, ముసుడి నరసింహ స్వామి, భూపతి మహేంద్ర, బొంతు సాయి, తదితరులు ఉన్నారు.

ఫోటో - http://v.duta.us/x50EZQAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/d6BS5gAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬