నేను బచ్చాగాడిని.. ప్రభాస్ అన్న అయితే బెటర్: విజయ్ దేవరకొండ

  |   Tollywood

హాలీవుడ్ యాక్షన్ మూవీస్ తెలుగులో అనువాదం కావడం పరిపాటే. ఈ డబ్బింగ్ సినిమాలు ఎప్పటి నుంచో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా జేమ్స్ బాండ్, అవెంజర్స్, టెర్మినేటర్, స్పైడర్ మ్యాన్ లాంటి యాక్షన్ మూవీ సిరీస్‌లంటే తెలుగు ప్రేక్షకులు పడిచచ్చిపోతారు. అందుకే ఇప్పుడు టెర్మినేటర్ సిరీస్‌లోని 'టెర్మినేటర్ డార్క్ ఫేట్' సినిమాను తెలుగులోకి అనువాదం చేసి విడుదల చేస్తున్నారు. ఆర్నాల్డ్ స్క్వార్జ్‌నెగ్గర్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా, ఈ చిత్ర ట్రైలర్‌ను సెన్సేషనల్ విజయ్ దేవరకొండ బుధవారం హైదరాబాద్‌లో లాంచ్ చేశారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. స్కూల్‌లో చదుకునే రోజుల్లో 'టెర్మినేటర్ 2: జడ్జిమెంట్ డే' సినిమా చూశానని చెప్పారు. అప్పట్లో ఆ సినిమాను బాగా ఎంజాయ్ చేశామని వెల్లడించారు. ఒకప్పుడు హాలీవుడ్ సినిమాల తెలుగు డబ్బింగ్ చూస్తే ఇరిటేషన్ వచ్చేదని.. ఇప్పుడు డబ్బింగ్ క్వాలిటీ చాలా బాగా పెరిగిందని చెప్పుకొచ్చారు. 'టెర్మినేటర్: డార్క్ ఫేట్'లో డబ్బింగ్ చాలా బాగున్నట్టు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోందన్నారు....

ఫోటో - http://v.duta.us/ia8jvAAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/wj-VswAA

📲 Get Tollywood on Whatsapp 💬