బాలకృష్ణ సినిమా టైటిల్‌ను బయటపెట్టేసిన జెమిని టీవీ

  |   Tollywood

నటిసింహా నందమూరి బాలకృష్ణ, ప్రముఖ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో రెండో సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఇది బాలకృష్ణకు 105వ చిత్రం. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో బాలయ్య లుక్‌కి సంబంధించి ఇప్పటికే పలు పోస్టర్లు విడుదలయ్యాయి. కొత్త గెటప్‌లో బాలకృష్ణను చూసి అభిమానులతో పాటు సినీ ప్రేమికులు ఆశ్చర్యానికి గురయ్యారు.

కాగా, ఈ సినిమా టైటిల్‌ను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కాకపోతే టైటిల్ విషయంలో ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. మొదట 'రూలర్' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు టాక్ వినిపించింది. ఆ తరవాత 'క్రాంతి', 'జడ్జిమెంట్', 'డిపార్ట్‌మెంట్' పేర్లు కూడా తెరమీదికి వచ్చాయి. కానీ, మొదట వినిపించిన టైటిల్‌నే ఖరారు చేసినట్టు స్పష్టమైంది. ఈ మేరకు ప్రముఖ ఎంటర్‌టైన్మెంట్ ఛానెల్ జెమిని టీవీ ప్రకటించేసింది.

సాధారణంగా కొత్త సినిమా టైటిల్‌ను ఆ చిత్ర నిర్మాణ సంస్థో.. లేదంటే హీరోనో, దర్శకుడో ప్రకటిస్తారు. అసలు టైటిల్ అనౌన్స్‌మెంట్ అనేది సినిమా ప్రమోషన్స్‌కు నాంది. కానీ, బాలయ్య సినిమా విషయంలో జెమిని టీవీ తొందరపడింది. ముందుగానే చిత్ర టైటిల్‌ను రివీల్ చేసేసింది. దీనికీ కారణం ఉంది. 'రూలర్' శాటిలైట్ హక్కులను జెమిని టీవీ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ టైటిల్‌ను కూడా బయటపెట్టేసింది....

ఫోటో - http://v.duta.us/1z--7AAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/5sDHpQAA

📲 Get Tollywood on Whatsapp 💬