రైతు భవిష్యత్తు - అభ్యున్నతి కోసమే రైతు భరోసా

  |   Telugunews

కందుకూరు : రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గడ్డుగా ఉన్నప్పటికీ ఆర్ధికంగా పుంజుకోడానికి గత ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేకుండా అప్పుల కుప్పగా మార్చినప్పటికీ తానిచ్చిన మాట ప్రకారం రైతన్న కళ్ళలో వెలుగులు చూడాలని అన్న లక్ష్యంతో రైతు భరోసా కార్యక్రమాన్ని జగన్‌ ప్రభుత్వం చేపట్టిందని శాసనసభ్యుడు మహీధర్‌ రెడ్డి కొనియాడారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో జరిగిన రైతు భరోసా కార్యక్రమంలో ఆయన లబ్ధిదారులకు పెట్టుబడి సాయం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. నియోజకవర్గంలోని 5 మండలాలకు చెందిన వ్యవసాయాధికారులతోపాటు రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే మహీధర్‌ రెడ్డి తన ప్రసంగం ఆద్యాంతం జగన్‌ ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. ప్రభుత్వం చేపడుతున్న పధకాలకు నిధులెక్కడివని అనుమానాలు వ్యక్తంచేస్తున్న వారికి తన చేతల ద్వారానే జగన్‌ ప్రభుత్వం సమాధానం చెబుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సిఎం కిసాన్‌ యోజన పేరుతో రూ.6 వేలు అందిస్తుంటే జగన్‌ ప్రభుత్వం ఇంకొక అడుగు ముందుకేసి రూ.7,500లు జతకలిపి మొత్తం రూ.13,500లు రైతు భరోసా పేరుతో రైతుకు అందించే కార్యక్రమం చేపట్టిందని అన్నారు. ఇది కేవలం పెట్టుబడి సాయం అనుకుంటే పొరపాటని అన్నారు. సమాజానికి వెన్నెముకలాంటి రైతు భవిష్యత్తు, అభ్యున్నతి కోసమే రైతు భరోసా కార్యక్రమాన్ని జగన్‌ ప్రభుత్వం ఘనంగా చేపట్టిందని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం వచ్చే ఏడాది నుండి ఈ పధకం ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, అనేక గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటు రైతాంగం పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని జగన్‌ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ముందుకు జరిపిందని వివరించారు. 7 వేల కోట్లకు పైగా వ్యయమయ్యే ఈ పధకాన్ని తమ శ్రేయస్సుకోసం చేపట్డడంతో రైతులోకం యావత్తు జగన్‌ ప్రభుత్వాన్ని కొనియాడుతుందని అభినందించారు. రైతు శ్రేయస్సుకోసం అనితర సాధ్యంగా ముఖ్యమంత్రి జగన్‌ అనూహ్యమైన పధకాలతో ప్రభుత్వాన్ని పరుగులు పెట్టిస్తున్నారని శ్లాఘించారు. గిట్టుబాటు ధరలేక రైతు దిక్కుతోచ ని స్థితిలో కొట్టుమిట్టాడి ఆత్మహత్యలకు పాల్పడుతున్న దయనీయ స్థితిని చెరిపేయాలన్న మంచి లక్ష్యంతో ధరల స్థిరీకరణ కోసం రూ.3 వేల కొట్ల నిధిని ఏర్పాటు చేయడం జరుగుతున్నదని అన్నారు. రైతును పిప్పిచేసే దళారి వ్యవస్థను సంపూర్ణంగా రూపుమాపే విధంగా వ్యవసాయ మార్కెట్‌ యార్డులను సంస్కరించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నదని అన్నారు. రైతులపట్ల జగన్‌ చూపిస్తున్న ప్రేమ అందరినీ అబ్బురపరుస్తున్నదని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన, చేపట్టిన పధకాలకు నిధులు ఎక్కడివని విమర్శిస్తున్నవారికి మహీధర్‌ రెడ్డి ధీటుగా బదులిచ్చారు. పరిపాలించే వ్యక్తికి కావలసింది పాలనా దక్షతే ముఖ్యమని, దాంతో నిధులు వాటంత అవే చేకూరుతాయని అన్నారు. ఎప్పుడైతే క్షేత్రస్థాయిలో నిధుల వినియోగం సక్రమంగా జరుగుతుందో... పధకాల లక్ష్యాన్ని చేరగలుగుతామో.... ఆ ప్రభుత్వానికి నిధులేకాదు ప్రజల ఆశీస్సులు కూడా నిండుగా లభిస్తాయని రైతుల హర్షధ్వానాల మధ్య స్పష్టంచేశారు....

ఫోటో - http://v.duta.us/Xi-dTAAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/lxVPIAAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬