విద్యార్థులలో దృష్టిలోపం నివారించేందుకే కంటి వెలుగు

  |   Telugunews

తర్లుపాడు : విద్యార్థులలో దృష్టిలోపాన్ని నివారించేందుకే వైయస్‌ఆర్‌ కంటి వెలుగు పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని, విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రధానోపాధ్యాయుడు యం. నారాయణరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని చెన్నారెడ్డిపల్లి ఆదిఆంద్ర మున్సిపల్‌ పాఠశాలలో విద్యార్థులకు కంటి పరీక్షలను నిర్వహించారు. ఈ సంధర్భంగా హెచ్‌యం మాట్లాడుతూ విద్యార్థులందరూ తమ కళ్లను పరీక్ష చేయించుకుని దృష్టిలోపాన్ని నివారించుకోవాలని సూచించారు. విద్యార్థులు తమ రోజువారీ ఆహారంలో విటమిన్‌లు, ప్రోటీన్‌లు ఉండేలా చూసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కశ్శెట్టి వెంకట జగన్‌, బి.ఓబయ్య, జి.రత్నాలు, ఆశకార్యకర్త తదితరులు పాల్గొన్నారు.

ఉర్దూ పాఠశాలలో....

పట్టణ పరిధిలోని ఎస్టేట్‌లో గల మద్రస ఎ ఉమ్మె హమీబా నిస్వాన్‌ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇస్లాం ధార్మిక ఉర్దూ బాలికల పాఠశాలలో పేద ముస్లిం బాలికలకు మంగళవారం వైయస్‌ఆర్‌ కంటి వెలుగు ద్వారా కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సంధర్భంగా మద్రసా నిర్వాహకులు షేక్‌. దౌలా మాట్లాడుతూ దృష్టిలోపంతో బాధపడుతున్న వారందరికి కంటిపరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన కళ్ల అద్దాలను అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీమ్‌ లీడర్‌ మండ్లా రామాంజనేయులు, ఉపాధ్యాయులు పి.సరిత, సమన్వయకర్త వై.జయమేరిలు పాల్గొని బాలబాలికలకు కంటి పరీక్షలు నిర్వహించారు.

ఫోటో - http://v.duta.us/bI_HjgAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/u1XY-gAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬