విద్యార్దులకు కంటి పరీక్షలు

  |   Telugunews

వేటపాలెం : స్దానిక నాయునిపల్లి పడమర మండల పరిషత్‌ ప్రాధమిక పాఠశాలలోని విద్యార్దలకు వైయస్‌ ఆర్‌ కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా విద్యార్దులకు కంటి పరీక్షలు నిర్వహించినట్లు మండల విద్యాశాఖాదికారి ఎన్‌. ఏకాంబరేశ్వరరావు తెలిపారు. పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్దులలో కంటి దోషమున్న విద్యార్దులుచదువులో వెనుకబడే అవకాశం ఉన్నందున ప్రభుత్వం వైయస్‌ ఆర్‌ కంటి వెలుగు కార్యక్రమం ప్రవేశ పెట్టిందని , దృష్టి లోపాలు ఉన్నచో వారికి చికిత్స చేయటం, అవసరమైన వారికి కళ్ల జోళ్లు అంద చేయటం జరుగుతుందని ఆయన తెలిపారు. అనంతరం అతర్జాతీయ హ్యాండ్‌ వాష్‌ దినోత్సవాన్ని పురస్కరించు కొని విద్యార్దులు చేతులు కడుక్కోవడం వలన కలిగే లాభాలు, లేనియెడల కలిగే జబ్బులు, ఏవిధంగా కడుక్కోవాలి అని విద్యార్దులకు వివరిం చారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ అసిస్టెంటు, జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల ఉపాద్యాయిని నాగరత్నం, పాఠశాల ప్రధానోపాద్యాయులు కె. రవి బాబు, ఉపాద్యాయులు , విద్యార్దులు పాల్గొన్నారు.

ఫోటో - http://v.duta.us/KNHrEgAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/TECIlwAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬