సురేష్ మూవీస్ చేతికి 'డిస్కోరాజా'.. హాట్ టాపిక్

  |   Tollywood

మాస్ మహారాజా రవితేజ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం 'డిస్కోరాజా'. ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. రవితేజ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే టాక్ వచ్చింది. ఈ సినిమాను డిసెంబర్‌లో విడుదల చేయాలని తొలుత భావించారు. కానీ, ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఇది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.

సినిమాలో కంప్యూటర్ గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యత ఎక్కువగా ఉందట. దీని మూలంగా సినిమా ఆలస్యమవుతోందని వినికిడి. అందుకే, వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదంటే వేసవి ప్రారంభంలో 'డిస్కోరాజా' విడుదల కావొచ్చు అంటున్నారు.

ఇదిలావుంటే, ఈ సినిమాను సురేష్ మూవీస్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ చేయనుంది. ఈ మేరకు డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసింది. అయితే, రవితేజ సినిమాను డిస్ట్రిబ్యూషన్‌కు ఇచ్చేయడం ఇప్పుడు ఫిల్మ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

సాధారణంగా పెద్ద హీరోల సినిమాల థియేట్రికల్ రైట్స్ అమ్ముకుంటారు. ప్రస్తుతం ఇదే ట్రెండ్. ప్రీ రిలీజ్ బిజినెస్‌లో అధిక భాగం ఈ థియేట్రికల్ రైట్స్‌దే. కానీ, డిస్కోరాజా నిర్మాత రామ్ తాళ్లూరి మాత్రం తన సినిమాను డిస్ట్రిబ్యూషన్‌కు ఇవ్వడం విశేషం. అది కూడా ఎటువంటి అడ్వాన్స్ లేకుండా డిస్ట్రిబ్యూషన్‌కు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఈ న్యూస్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది....

ఫోటో - http://v.duta.us/XlgFuQEA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/7gHPGwAA

📲 Get Tollywood on Whatsapp 💬