కుక్కలు బాబోయ్‌..

  |   Telugunews

రోడ్ పై నడవాలంటే భయం...

గుంపులుగా గ్రామ సింహాలు...

చర్యలకు ప్రజలు డిమాండ్...

మండపేట:-రోడ్డు మీద నడవాలంటే భయం.. అర్ధరాత్రి ఒంటరిగా వెళ్లాలంటే భయం.. గుంపులు గుంపులుగా రోడ్డును ఆక్రమించేస్తున్న కుక్కలు వాహనదారులు, పాదచారులకు పరీక్ష పెడుతున్నాయి. ఫలితంగా రోజురోజుకూ కుక్కకాటు బాధితులు పెరుగుతుండటం ఆందోళన చెందాల్సిన విషయం.

సమస్య తీవ్రతరం...

ప్రాణాలతో ముడిపడిన ఇంత తీవ్రమైన సమస్యను అధికార యంత్రాంగం తేలిగ్గా తీసుకుంటోంది.మండపేటతోపాటు జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో వీధి కుక్కలు గుంపులుగా తిరుగుతూ మనుషులపై దాడి చేస్తున్నా పురపాలక సంఘాలు, గ్రామ పంచాయితీ అధికారులు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా అక్టోబర్ నెల లో సంతానోత్పత్తికి సిద్ధమయ్యే సమయంలో కుక్కలు రెచ్చిపోయి వీధుల్లో నడిచి వెళ్లేవారిని, ఆడుకునే పిల్లలను కరవడం పరిపాటిగా మారింది.

ఎక్కడైనా ఇదే వరస...

చిర్రెత్తుపోతున్న కుక్కలు వీధుల్లో కనబడినవారినల్లా కరుస్తున్నాయి. పట్టణాలు, పల్లెల్లో వీధికుక్క కనిపిస్తే చాలు ప్రజలు భయంతో దాక్కోవాల్సి వస్తోంది. ఎవరైనా ఫిర్యాదులు చేస్తుంటే.. కుక్కలను పట్టుకుని చంపడానికి నిబంధనలు అడ్డుగా మారుతున్నాయంటూ సాకులు చెప్పి తప్పించుకుంటున్నారు. కనీసం కుక్కల సంతానోత్పత్తిని అరికట్టి, వాటి సంఖ్యను అరికట్టే ప్రయత్నాలు కూడా చేయకపోవడంతో నానాటికీ సమస్య ఎక్కువవుతోంది. వీధి కుక్కలు గుంపులుగా సంచరిస్తుండటంతో ఎప్పుడు ఎవరి మీద దాడి చేస్తాయోనన్న భయంతో వణికిపోతున్నారు....

ఫోటో - http://v.duta.us/wiLS_QAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/uf9fcQAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬