కల్కీ ఆశ్రమాలపై ఐటి దాడులు - రూ 33 కోట్ల నగదు స్వాధీనం..

  |   Telugunews

చిత్తూరు - కల్కి ఆశ్రమాలు, ప్రధాన కార్యాలయాల్లో జరిగిన ఐటి దాడుల్లో ఇప్పటి వరకూ రూ 33 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.. భారీగా ఆస్తుల పత్రాలను సీజ్ చేశారు.. నిన్న ప్రారంభమైన ఐటి సోదాలు నేడు కూడా కొనసాగుతున్నాయి. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో ఏకకాలంలో విస్తృతంగా తనిఖీలు జరుగుతున్నాయి. 400 మంది అధికారులు 10 బృందాలుగా రంగంలోకి దిగారు. కల్కి ప్రధాన ఆశ్రమం తమిళనాడు పోలీసుల పహారాలో ఉంది. దాడుల సమయంలో కల్కి భగవాన్‌, ఆయన భార్య పద్మావతి అందుబాటులో లేరు. చెన్నై నుంగంబాకంలోని మెయిన్ ఆఫీస్ లో కల్కి కొడుకు కృష్ణ, కోడలు ప్రీతిని ఐటీ అధికారులు విచారిస్తున్నారు. తొలి రోజు ఐటీ సోదాల్లో భారీగా నగదు పట్టుబడింది. రూ.33 కోట్ల క్యాష్ సీజ్ చేశారు. అందులో భారత కరెన్సీకి సంబంధించి రూ.24 కోట్లు ఉన్నాయి. చెన్న, బెంగళూరు నగరాల్లో భారీగా భూములు కొన్నట్టు గుర్తించారు. ఆఫ్రికా, ఖతార్ దేశాల్లోనూ ఆస్తులున్నట్లు కనుగొన్నారు. ట్రస్ట్ నిర్వాహాకులు కృష్ణాజీ దంపతులను అధికారులు ప్రశ్నిస్తున్నారు. కృష్ణాజీ ఇంట్లో రూ.9కోట్ల అమెరికన్ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లాలోని వరదయ్యపాలెం, బీ ఎన్‌. కండ్రిగ మండలాల్లో ఉన్న ఆశ్రమాల ట్రస్ట్‌ నిర్వహాకుడు లోకేష్‌ దాసాజీతో పాటు మరికొంతమంది సిబ్బందిని ఐటీ అధికారులు విచారిస్తున్నారు. ఈ సోదాల్లో వందల కోట్ల విలువైన అక్రమ ఆస్తులను గుర్తించారు. అలాగే బినామీల పేరుతో వేల ఎకరాల భూముల క్రయ విక్రయాలు జరిపినట్లు అధికారులు కనుగొన్నారు.

ఫోటో - http://v.duta.us/JnF41QAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/se8VqAAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬