గ్రంధాలయాలకు మోక్షం ఎపుడు?

  |   Telugunews

కొనకనమిట్ల : మండలంలోని మేజర్‌ గ్రామపంచాయితీలైన కొనకనమిట్ల, పెదారికట్ల, గొట్లగట్టు గ్రామాలలో గతంలో గ్రామీణ గ్రంధాలయాలు ఏర్పాటు చేశారు. పాఠకులకు ఉపయోగంగా ఉన్న గ్రంధాలయాలు కొన్నేళ్లకు మూతపడ్డాయి. కొనకనమిట్ల పంచాయితీ కార్యాలయంలో ఉన్న గ్రంధాలయం 7 నెలలుగా మూతపడింది. అక్కడ పనిచేస్తున్న ఒప్పంద పాలకుడు జి.వెంకటసుబ్బయ్య 60 సంవత్సరాలు వచ్చాయని రిటైర్‌మెంట్‌ ఇచ్చారు. గొట్లగట్టు గ్రంధాలయంలో 13 సంవత్సరాల క్రితం పనిచేసే గ్రంధపాలకుడు మాదారపు నాగయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు గ్రంధపాలకుడిని నియమించకపోవడంతో ఈ గ్రంధాలయం మూతపడింది. పెదారికట్ల గ్రామంలో గ్రామీణ గ్రంధాలయం పంచాయితీ కార్యాలయాలలో ఒక చిన్నగదిలో ఏర్పాటు చేశారు. ఇక్కడ పనిచేసే గ్రంధపాలకుడు అచ్యుతకుమార్‌ మరణించడంతో ఈ గ్రంధాలయం కూడా మూతపడింది. గొట్లగట్టు, కొనకనమిట్ల, పెదారికట్ల మేజర్‌ పంచాయితీ గ్రామాలు కనుక నిత్యం ఈ గ్రామాలలో ప్రజలు గ్రంధాలయాలకు వస్తుంటారు. ఈ గ్రంధాలయాలు మూతపడడంతో గ్రంధపాలకులు నిరుత్సాహంతో వెనుదిరుగుతున్నారు. ఆయా గ్రామాల గ్రంధాలయాలకు ప్రభుత్వ పాఠశాల, వసతి గృహం విద్యార్థులు అనేకమంది ప్రజలు, వయోవృద్దులకు గ్రంధాలయాలు ఎంతగానో ఉపయోగపడేవి. రామాయణం, మహాభారతం వంటి పుస్తకాలు చదువుతూ కాలక్షేపం చేసేవారు. పాఠ కులకు విజ్ఞానాన్ని అందించే గ్రంధాలయాలకు గ్రహణం పట్టింది. గ్రంధపాలకులు లేక ఏళ్ల తరబడి మూతపడి పాఠ కులకు మొండిగోడలు, చెదలుపట్టిన పుస్తకాలు దర్శనం ఇస్తున్నాయి.ఏడాదికి ఒకసారి గ్రంధాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్న జిల్లా గ్రంధాలయ సంస్థ అధికారులు గ్రామీణ గ్రంధాలయాలు మూతపడిపోయిన విషయాన్ని మరిచారు. ఈ గ్రంధాలయాలు మూతపడి ఏళ్లు గడుస్తున్నా సంభంధిత అధికారులు, ప్ర జాప్రతినిధులు కానీ పట్టించుకున్న దాఖలాలు లేవని పాఠకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూతపడిన గ్రంధాలయాలపై జిల్లా అధికారులు, సంస్థ శాఖాధికారులు స్పందించి తక్షణం చర్యలు తీసుకుని గ్రంధాలయాలకు గ్రంధపాలకులను నియమించి వాటికి సొంత భవనాలు ఏర్పాటు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

ఫోటో - http://v.duta.us/doFv-gAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/i40pcwAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬