నూతనం ఇంటిస్థలాలకు 581 అర్జీలు

  |   Telugunews

మార్కాపురం, జిల్లా కలెక్టర్‌ పోలా భాస్కర్‌ ఆదేశాల ప్రకారం మార్కాపురం పురపాలక సంఘ పరిధిలోని 1 నుండి 10 వార్డులకు గురువారం వార్డు సభలు నిర్వహించడం జరిగిందని కమీషనర్‌ నయీమ్‌ అహ్మద్‌ తెలిపారు. ఈ వార్డులసభలలో ఇంటిస్థలాలకు మంజూరైన, తిరస్కరణకు గురైన వారి జాబితాలను అధికారులు చదివి వినిపించడం జరిగిందని తెలిపారు. గురువారం నిర్వహించిన వార్డు సభలలో నూతనంగా ఇండ్ల స్థలాల కొరకు 581 మంది అర్జీలు అందజేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. 18వ తేదీ 11 వార్డుల నుండి 22 వార్డుల వరకు వార్డు సభలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 11, 12 వార్డులకు స్లేట్‌ వర్కర్స్‌ కాలనీలోని మున్సిపల్‌ స్కూల్‌ వద్ద, 13,14,15,16 వార్డులకు తర్లుపాడు రోడ్డులోని వాటర్‌ ట్యాంక్‌ వద్ద, 17,18,19,20 వార్డులకు శ్రీనివాస థియేటర్‌ వద్ద గల ఖాళీస్థలంలో, 21,22 వార్డులకు పాండురంగస్వామి గుడి వద్ద వార్డు సభలు నిర్వహించబడునని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ సిబ్బంది, వార్డు వాలంటీర్లు, వార్డు సెక్రటరీలు, ప్రజలు పాల్గొన్నారు.

ఫోటో - http://v.duta.us/JgBgawAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/UN6m0gAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬