పొగాకు సాగును నియంత్రించుకోక తప్పదు

  |   Telugunews

కందుకూరు : అంతర్జాతీయంగా ఉత్పన్నమైన పరిస్థితుల దృష్ట్యా పొగాకు సాగును తప్పనిసరిగా నియంత్రించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని కందుకూరు పోగాకు వేలం నిర్వహణాధికారి డి.వేణుగోపాల్‌ స్పష్టంచేశారు. లింగసముద్రం మండలం మొగిలిచర్ల గ్రామంలో జరిగిన రైతు సదస్సులో ఆయన మాట్లాడుతూ... పలు సూచనలు చేశారు. పొగాకు బోర్డు అనుమతించిన విస్తీర్ణంలోనే సాగుచేయాలని అన్నారు. మిగిలిన భూమిలో అక్కడి వాతావరణానికి అనుకూలమైనటువంటి ఇతర లాభసాటి పైర్లు వేసుకోవాలని సూచించారు. భూములను, బ్యారన్‌లను కౌలుకు తీసుకొని సాగుచేయడం వలన పొగాకు లాభదాయకం కాదని అన్నారు. సొంత బ్యారన్‌లు ఉన్నవారుమాత్రమే పొగాకు సాగు గిట్టుబాటు అవుతుందని అన్నారు. ప్రతి ఏటా అదే భూమిలో పొగాకును పండించడం వలన పంట నాణ్యత దెబ్బతింటుందని అన్నారు. పంట మార్పిడి విధానాన్ని విధిగా పాటించడం వలన రైతుకు మేలు చేకూరుతుందని సలహా ఇచ్చారు. రసాయనిక ఎరువుల వాడకం తగ్గించుకొని సేంద్రీయ ఎరువులు వాడకం వలన భూసారాన్ని రక్షించుకోవచ్చునని తద్వారా నాణ్యమైన దిగుబడులు సాధించుకోవచ్చునని అన్నారు. పచ్చిరొట్ట ఎరువులు వేసినందువలన నత్రజని ఎరువులను తగ్గించుకోవచ్చునని అన్నారు. పొటాష్‌ ఎరువును విధిగా వేయడం వలన పొగాకు నాణ్యత గణనీయంగా పెరుగుతుందని అన్నారు. అంతర్జాతీయ పరిస్థితులను అవగాహన చేసుకొని రైతులు పొగాకు సాగు నియంత్రణకు సిద్దం కావలని కోరారు. పర్యావరణ పరిరక్ష్‌ణలో భాగంగా ప్రతి రైతు భాగస్వామి కావాలన్న లక్ష్యంతో ప్రతి రైతు పది మొక్కలు నాటి భావితరాలకు చక్కని పర్యవారణాన్ని అందించాలన్నది బోర్డు ఉద్దేశ్యమని అన్నారు. సహజసిద్ధమైన ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు మొగ్గుచూపాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్‌జిఓ చంద్రశేఖర్‌, ఎస్‌ఆర్‌ఎం శ్రీహర్ష తదితరులు పాల్గొన్నారు.

ఫోటో - http://v.duta.us/gPlc2wAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/oEfCnQAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬