రోడ్ల అభివృద్దికి 5ఏళ్ల ప్రణాలిక సిద్దం చేసుకోండి

  |   Telugunews
  • పంచాయితీరాజ్‌ ఇంజనీరింగ్‌ చీఫ్‌ను కలిసిన ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి

మార్కాపురం, : నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ది కోసం రాబోయే 5 సంవత్సరాలకు పక్కా ప్రణాలిక సిద్దం చేసుకోవాలని రాష్ట్ర పంచాయితీరాజ్‌ శాఖ ఇంజనీరింగ్‌ ఇన్‌ చీఫ్‌ సుబ్బారెడ్డి ఎమ్మెల్యే నాగార్జునరెడ్డికి సూచించారు. గురువారం మార్కాపురం వచ్చిన సంధర్భంగా పంచాయితీరాజ్‌ అతిధి గృహంలో ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి వెళ్లి సుబ్బారెడ్డిని కలిశారు. ఈ సంధర్భంగా మార్కాపురం నియోజకవర్గంలో పంచాయితీరాజ్‌, రోడ్ల అభివృద్దికి నిధులు మంజూరు చేసి సహకరించాలని చేసిన విజ్ఞప్తికి ఇంజనీరింగ్‌ ఇన్‌ చీఫ్‌ సుబ్బారెడ్డి స్పందిస్తూ త్వరలో ప్రత్యేక అభివృద్ది ఫండ్‌ కూడా విడుదల అవుతుందని తెలిపారు. నియోజకవర్గంలోని గ్రామాలలో, మండలాలలో, గ్రామాల నుండి మండల కేంద్రాలకు అవసరమైన కనెక్టివిటి రోడ్లకు ప్రతిపాదనలు తయారు చేసి పంపాలని సూచించారు. అంతర్గత రోడ్లకు కూడా ప్రతిపాదనలు పంపాలన్నారు. వీటిని ప్రాధాన్యత క్రమంలో నిధులు మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రత్యేక అభివృద్ది నిధుల ద్వారా పలు రోడ్లను అభివృద్ది చేసుకోవచ్చని సూచించారు. ఇక్కడి నుండి ప్రతిపాదనలు వచ్చినట్లైతే తాను పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

ఫోటో - http://v.duta.us/QvKIiAEA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/6IpgeAAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬