విజయ్ 'విజిల్' తెలుగు ట్రైలర్.. విజిల్ వేయాల్సిందే

  |   Tollywood

తమిళ దళపతి విజయ్ కొత్త సంచలనాలకు తెరతీశారు. తెరీ, మెర్స‌ల్ త‌ర్వాత సంచలన దర్శకుడు అట్లీతో కలిసి 'బిగిల్‌' అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటించారు విజయ్. ఈ మూవీ ట్రైలర్‌ను గత శనివారం తమిళ్‌లో విడుదలై పాత రికార్డుల్ని తుడిచిపెట్టేసింది. విడుదలైన 12 గంటల్లోనే 13 మిలియన్‌ (కోటీ 30 లక్షలు)లకు పైగా వ్యూస్‌ సాధించిన బిగిల్‌ సరికొత్త రికార్డ్‌ను నెలకొల్పింది. దీంతో #BigilTrailerRecords అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లో ఉంది.

తమిళ్‌తో పాటు తెలుగులోనూ విజయ్‌కి మంచి క్రేజ్ ఉండటంతో ఈ మూవీని తెలుగులో 'విజిల్' పేరుతో విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో విజయ్ మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో మెస్మరైజ్ చేస్తున్నారు. ఒలంపిక్స్ నేప‌థ్యం ఉన్న కథలో విజయ్.. ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా, రౌడీగా, నాయకుడిగా కనిపిస్తున్నారు. కళ్లు చెదిరే యాక్షన్స్ ఎపిసోడ్‌తో విజిల్ వేయిస్తున్నాడు విజయ్. ఈ చిత్రంలో విజయ్ సరసన నయనతార నటించగా.. వివేక్‌, యోగిబాబు, డేనియల్‌ బాలాజీ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ స్వరాలను సమకూర్చారు....

ఫోటో - http://v.duta.us/4OOqnAAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/ukCe6AAA

📲 Get Tollywood on Whatsapp 💬