'సైరా' థియేటర్లపై టాస్క్‌ఫోర్స్ దాడులు.. విషయమేంటి?

  |   Tollywood

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'సైరా నరసింహారెడ్డి' మూవీ తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన వసూళ్లను రాబట్టింది. విడుదలైన ప్రతి చోటా లాభాల బాట పట్టేందుకు సిద్ధమవుతోంది. సినిమా విడుదలై రెండు వారాలు గడిచినా ఇప్పటికీ మంచి కలెక్షన్లనే రాబడుతోంది. అయితే, 'సైరా' ప్రదర్శితమవుతోన్న థియేటర్లపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన జీఎస్టీ టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారనే వార్త ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విషయంలో చాలా పక్కాగా వ్యవహరిస్తోంది. ఆయా రంగాల నుంచి తమకు రావాల్సిన జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం ముక్కుపిండి మరీ వసూలు చేస్తోంది. సినిమా రంగానికి కూడా జీఎస్టీ వర్తిస్తోన్న సంగతి తెలిసిందే. థియేటర్లలో సినిమాను ప్రదర్శించే బయ్యర్లు జీఎస్టీని తూచా తప్పకుండా చెల్లించాలి. ప్రస్తుతం 'సైరా' భారీ కలెక్షన్లు రాబడుతోంది. కాబట్టి, జీఎస్టీని పక్కాగా చెల్లించారా? లేదా? అనే విషయాన్ని పరిశీలించేందుకు టాస్క్‌ఫోర్స్ అధికారులు రంగంలోకి దిగారు.

Also Read:

తూర్పుగోదావరి జిల్లాలోని పలు థియేటర్లలో బుధవారం జీఎస్టీ టాస్క్‌ఫోర్స్ అధికారులు సోదాలు నిర్వహించారని సమాచారం. లెక్కలన్నీ సరిగా ఉన్నాయా లేదా అని ఆయా థియేటర్లలో పరిశీలించారట. అయితే, అధికారులకు అక్కడ ఎలాంటి సమాచారం లభించింది, లెక్కల్లో తేడాలు ఏమైనా ఉన్నాయా? వంటి విషయాలు తెలియరాలేదు. అలాగే, అధికారులు తూర్పుగోదావరితో పాటు ఇంకా ఎక్కడైనా సోదాలు నిర్వహించారా అనే విషయంపై కూడా స్పష్టత రావాల్సి ఉంది....

ఫోటో - http://v.duta.us/zH93MQAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/9hGzngAA

📲 Get Tollywood on Whatsapp 💬