అంధత్వ నివారణే లక్ష్యంగా వై.యస్.ఆర్.కంటి వెలుగు పథకం..

  |   Telugunews

శ్రీకాకుళం, : అంధత్వ నివారణే లక్ష్యంగా డా II వై.యస్.ఆర్. కంటి వెలుగు కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు జిల్లా అంధత్వ నివారణ సంస్థ ( డి.బి.సి.యస్ ) జిల్లా ప్రోజెక్ట్ మేనేజర్ డా. జి.వి.రమణకుమార్ వెల్లడించారు. అక్టోబర్ 10న రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభిస్తున్న డా II వై.యస్.ఆర్. కంటి వెలుగు కార్యక్రమంపై ఇన్ ఛార్జ్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. బగాది జగన్నాథరావు, జిల్లా విద్యాశాఖాధికారి కె.చంద్రకళతో కలిసి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో బుధవారం ఉదయం డా. జి.వి.రమణకుమార్ పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 10న డా. వై.యస్.ఆర్.కంటి వెలుగు కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని 3 దశలలో నిర్వహించడం జరుగుతుందని, అక్టోబర్ 10 నుండి 16 వరకు నిర్వహించే మొదటి దశలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 5 నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్ధులకు ఉచిత కంటి పరీక్షలను నిర్వహించి , వారికి మందులను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. నవంబర్ 1 నుండి డిసెంబర్ 31 వరకు రెండవ దశ నిర్వహిస్తామని, ఇందులో దృష్టిలోపాలు కలిగిన విద్యార్ధులకు నాణ్యమైన కంటి పరీక్షలు మరియు ఉచిత కంటి అద్దాలను పంపిణీచేయడం జరుగుతుందని, అలాగే మెల్లకన్ను, ఇతర కంటి సమస్యలకు ఉచిత చికిత్సను నిర్వహిస్తామని పేర్కొన్నారు. మూడవ దశ క్రింద 2020 ఫిబ్రవరి 1వ తేదీ నుండి 2022 జనవరి 31 వరకు జిల్లాలోని ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత కంటి పరీక్షలు మరియు ఉచిత కంటి అద్దాల పంపిణీ చేస్తామని తెలిపారు. వీటితో పాటు ఉచిత శుక్లాల శస్త్రచికిత్సలు , గ్లకోమా, డయాబెటిక్ రెటినోపతి మొదలగు కంటి సమస్యలకు ఉచిత చికిత్సలను నిర్వహించడం జరుగుతుందని వివరించారు....

ఫోటో - http://v.duta.us/alMDxgAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/zD56CgAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬