అవగాహనతో పొగాకు సాగుచేయాలి

  |   Telugunews

కందుకూరు , : అంతర్జాతీయంగా పొగాకు పంట ఎదుర్కొంటున్న తీవ్ర ప్రతికూల, మాంద్య పరిస్థితులను అవగాహనచేసుకొని కాలానుగుంణంగా రైతులు పొగాకు పంటను సాగుచేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉదని కందుకూరు పొగాకు బోర్డు-1 వేలం కేంద్రం నిర్వహణాధికారి మల్లెల బాబురావు స్పష్టంచేశారు. బుధవారం మహదేవపురం గ్రామంలో జరిగిన రైతు అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పొగాకు బోర్డు అనుమతించిన మేరకే సాగుచేయాలని, అంతకుమించి అనధికార సాగు చేపడితే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పంట గిట్టుబాటు ధర గురించి సరైన అవగాహనతో రైతులు సాగుకు సంబంధించిన ఖర్చులను అంచనా వేసుకొని సాగుచేయాలని అన్నారు. లేనిపోని భ్రమలతో ఎక్కువ ఆశకుపోయి భూమి కౌలు , బ్యారన్‌ కౌలు పెంచుకుంటూ పోతే పొగాకు రైతు అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం పొంచి ఉందని స్పష్టంచేశారు. అలాంటి వ్యవసాయం మంచికాదని హితవు చెప్పారు. నాణ్యమైన పంట దిగుబడుల కోసం రైతు ప్రత్యేక దృష్టిసారించాలని కందుకూరులోని పొగాకు పరిశోధనా కేంద్రం ఇన్‌చార్జి యం.అనూరాధ సూచన చేశారు. నారును ఎంచుకొనే సమయంలోనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. చీడపీడలు లేనటువంటి ధృఢమైన నారును ఎంచుకొని నాట్లు చేపట్టాలని సలహాఇచ్చారు. నాణ్యమైన దిగుబడుల సాదన కోసం పొటాష్‌ ఎరువు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐటిసి డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ శ్రీధర్‌ రెడ్డి, పొగాకు బోర్డుకు చెందిన సీనియర్‌ గ్రేడింగ్‌ అధికారి కె.రామకృష్ణతోపాటు, కె.రాజగోపాల్‌రెడ్డి, శివనారాయణ, జ్యోస్న తదితరులు పాల్గొన్నారు.

ఫోటో - http://v.duta.us/6Lug6gAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/8bJWIAAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬