చెరుకు రైతుల బకాయిలు చెల్లించాలి ...తాండవ షుగర్స్ ఎదుట బిజెపి శ్రేణులు ఆందోళన

  |   Telugunews

తుని : తాండవ షుగర్ ఫ్యాక్టరీ కి చెరుకును సరఫరా చేస్తున్న రైతుల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. కేంద్ర నేతల సమక్షంలో బిజెపి తీర్థం తీసుకున్న తోట నగేష్ రైతుల సమస్యలపై పోరాటానికి శ్రీకారం చుట్టారు. బుధవారం సాయంత్రం తాండవ షుగర్ ఫ్యాక్టరీ కార్యాలయం ఎదుట బిజెపి నేత తోట నగేష్ ఆధ్వర్యంలో వందలాది మంది పార్టీ కార్యకర్తలు, రైతులు ధర్నా నిర్వహించారు. ఫ్యాక్టరీకి చెరకు సరఫరా చేసే 1200 మంది రైతులకు ఆరున్నర కోట్ల రూపాయల మేర బకాయిలు చెల్లించాల్సి ఉందని,అదేవిధంగా మరో 6 కోట్ల రూపాయలు కార్మికుల జీతభత్యాలు చెల్లించవలసి ఉందన్నారు. ఈ మొత్తాన్ని వెంటనే చెల్లించి రైతులను కార్మికులను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాండవ, ఏటికొప్పాక, గోవాడ,భీమసింగి షుగర్ ఫ్యాక్టరీలో ఆధునీకరణకు జాతీయ సహకార అభివృద్ధి సంస్థ 200 కోట్ల రూపాయలను విడుదల చేసిందని, ఈ మొత్తాన్ని ఈ ఫ్యాక్టరీలు వినియోగించకుండా, ఇప్పటికే మూతపడిన ఫ్యాక్టరీలకు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్న ఈ నాలుగు ఫ్యాక్టరీలు మూతపడే ప్రమాదం ఉందని తోట నగేష్ హెచ్చరించారు. మూత పడిన చక్కెర కర్మాగారాలను తిరిగి తెరిపించాలన్నా చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే ప్రత్యేక గ్రాంట్లు విడుదల చేయాలని కోరారు. తాండవ షుగర్ చెరుకు రైతులకు బకాయిలు చెల్లించడం తోపాటు, కార్మికుల జీతాలు బకాయిలను వెంటనే చెల్లించాలని యాజమాన్యం స్పందించకపోతే తమ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ నేతలు ఎం గాంధీ, ఏ శ్రీకాంత్,...

ఫోటో - http://v.duta.us/ZYwyEgAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/Z2Nt4QAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬