దసరా మండపంలో వేంచేసిన చెన్నకేశవ స్వామి

  |   Telugunews

మార్కాపురం, : శ్రీ లక్ష్మీచెన్నకేశవ స్వామి వారు దసరా పర్వదినాన వేటకు వెళుతూ మార్గమధ్యంలోని మండపంలో సేదతీరి తిరిగి మరలా ఆలయానికి చేరుకునే పార్వేట కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం దసరా పర్వదినాన ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు నంద్యాల తిరుమలాచార్యులు, శ్రీపతి అప్పనాచార్యులు ఈ పార్వేట ఉత్సవంలో దసరా మండపంలో ఉన్న శ్రీచెన్నకేశవస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం నుంచి స్వామి వారిని పల్లకీ మీద తీసుకువెళ్లి దసరా మండపంలో స్వామి వారిని ఉంచి అక్కడ ప్రత్యేక పూజలు అనంతరం శమీ పూజలను గ్రామపురోహితులు సోమయాజుల మల్లికార్జునశర్మ నిర్వహించారు. మండపంలో స్వామి వారిని దర్శించి తరించాలని పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరైనారు. పార్వేట ఉత్సవంలో ఆలయ ఇ.ఓ ఈదుల చెన్నకేశవరెడ్డి దసరా మండపం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జమ్మిచెట్టు వద్ద శమీ పత్రం తీసుకుని భక్తులకు అర్చకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ట్రస్టుబోర్డు చైర్మన్‌ రామడుగు కోటేశ్వరరావు, పెరుమాళ్ల సుబ్రహ్మణ్యం పలువురు నాయకులు, మాజీ ధర్మకర్తలు భక్తులు పాల్గొన్నారు.

ఫోటో - http://v.duta.us/6kL4PgAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/g_pwMwAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬