పట్టాలు తప్పిన గూడ్స్ - పలు రైళ్లు ఆలస్యం

  |   Telugunews

...బయ్యవరం, నరసింగపల్లి స్టేషన్ల మధ్య ప్రమాదం

...అర కిలోమీటరు మేర దెబ్బతిన్న ట్రాక్

... 1600 స్లీపర్లు ధ్వంసం ...పలు రైళ్లు ఆలస్యం

తుని : విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు బొగ్గు లోడు తీసుకుని వెళుతున్న గూడ్స్ రైలు బయ్యవరం, నరసింగపల్లి రైల్వే స్టేషన్ల మధ్య మంగళవారం ఉదయం పట్టాలు తప్పడంతో విశాఖ విజయవాడ మధ్య నడిచే పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. తుని జి ఆర్ పి ఎస్ పరిధిలో 732/29 కిలోమీటర్ రాయి వద్ద పట్టా విరిగి పోవడంతో ఈ ప్రమాదం జరిగింది. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో అర కిలోమీటరు మేర ట్రాక్ ధ్వంసమైంది. సుమారు 1600 కాంక్రీట్ స్లీపర్లు దెబ్బతిన్నాయి. పట్టాలు తప్పిన గూడ్స్ వ్యాగన్ లను ప్రత్యేక క్రేన్ లతో తొలగించి గూడ్స్ రైలును పంపించారు. ప్రమాదం జరిగిన అఫ్ లైన్ లో రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. సింగిల్ లైన్ పైనే రైళ్లను నడపవలసి రావడంతో పలు రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడిచాయి. రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. దెబ్బతిన్న ట్రాక్ మరమ్మతు పనులు చేపట్టారు. ఈ ప్రమాదం వలన దక్షిణ మధ్య రైల్వే కి భారీ నష్టం ఏర్పడింది.

ఫోటో - http://v.duta.us/cFg3VgAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/8_KgbwAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬