ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష అభియాన్‌ ద్వారా 70 మంది గర్భిణీలకు వైద్య పరీక్షలు

  |   Telugunews

గాలివీడు : గాలివీడు మండల కేంద్రములోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపరిధిలో దానం రెడ్డి గారి పల్లి ,అరవీటి వాండ్ల పల్లి తదితర గ్రామాల్లో భుదవారం ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష అభియాన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా వైద్యాధికారిని డాక్టర్పి శ్రావణి 70 మంది గర్భిణీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు నిర్వహించినవారిలో 4 గురికి హైరిస్క్ వుండడముతో జిల్లా ఆసుపత్రికి రెఫెర్ చేసామని తెలిపారు.ఈ సందర్బముగా డాక్టర్ మాట్లాడుతూ ప్రతి నెలా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన గర్భిణీలకు సూచించారు.అలాగే నేటి నుండి గురువారం న మండల కేంద్రములోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాటశాల అవరనములో వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభమవుతుందని ముఖ్య అతిధిగా మండల వైకాపా నాయుకులు యదు భూషణ్ రెడ్డి హాజరవుతారని పి హెచ్ సి పరిధిలో కంటివెలుగు 27కిట్లు వచ్చాయిని మొదటి విడత లో మండలము లోని అన్ని ప్రభుత్వ పాటశాల విద్యార్థులకి చికిస్థలు చేస్తామని తెలిపారు .ఇప్పటికే ఆశా కార్యకర్తలకి ,ఉపాద్యాయులకి కంటివెలుగు పై శిక్షణ ఇచ్చామని తెలిపారు.ఈ కార్యక్రములో ఈమెతోపాటు ఆరోగ్య విస్తరణ అధికారి మహేశ్వర రెడ్డి,ఆసుపత్రి సిబ్బంది ,ఆరోగ్య,ఆశా కార్యకర్తలు ఉన్నారు.

ఫోటో - http://v.duta.us/qforygAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/JdhDwQAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬