మంచు విష్ణు సెట్‌లో మున్నాభాయ్‌.. ఎందుకొచ్చినట్టు?

  |   Tollywood

హీరోగా ప్రూవ్‌ చేసుకునేందుకు మంచు విష్ణు చాలా రోజులుగా కష్టపడుతున్నాడు. స్టార్‌ వారసుడిగా సిల్వర్‌ స్క్రీన్‌ అరంగేట్రం చేసినా.. స్టార్ ఇమేజ్‌ అందుకోవటంలో మాత్రం విష్ణు ఫెయిల్‌ అవుతున్నాడు. కామెడీ సినిమాలతో ఒకటి రెండు సక్సెస్‌లు సాధించినా భారీ సక్సెస్‌లు మాత్రం సాధించలేకపోతున్నాడు. నటుడిగా కొనసాగుతూనే నిర్మాతగానే తన మార్క్‌ చూపిస్తున్నాడు ఈ యంగ్ హీరో.

ఇటీవల లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్న ఈ మంచువారబ్బాయి ప్రస్తుతం ఓ అంతర్జాతీయ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. హాలీవుడ్‌ దర్శకుడు జెఫ్రీ గీచిన్‌ దర్శకత్వంలో ఓ హాలీవుడ్ సినిమాలో నటిస్తూ నిర్మిస్తున్నాడు విష్ణు. హాలీవుడ్, టాలీవుడ్‌ నటులు, సాంకేతిక నిపుణుల కలయికలో తెరకెక్కుతున్న ఈ మల్టీకల్చరల్‌ సినిమాను మార్‌ ఎంటర్‌టైన్మెంట్‌, ఏవీఏ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌లపై విరోనికా మంచు నిర్మి్స్తోంది.

Also Read:

తెలుగు, ఇంగ్లీష్‌ భాషాల్లో రూపొందుతున్న ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌, రుహాని సింగ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో సునీల్‌ పోలీస్‌ అధికారిగా కనిపించనున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్‌ టాలీవుడ్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది....

ఫోటో - http://v.duta.us/tiGlSAEA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/QeP0_QEA

📲 Get Tollywood on Whatsapp 💬