శ్రీ తలుపులమ్మ లోవ లో ముగిసిన దసరా ఉత్సవాలు

  |   Telugunews

"రాజరాజేశ్వరీ దేవి" గా అమ్మవారు

తుని : ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన శ్రీ తలుపులమ్మ లోవ దేవస్థానం లో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిసాయి. పది రోజులపాటు తలుపులమ్మ వారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేశారు. చివరి రోజు అమ్మవారు రాజరాజేశ్వరీ దేవిగా దర్శనమిచ్చారు. ప్రత్యేక పూలతో అమ్మవారిని శోభాయమానంగా అలంకరించారు. వేద మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. వేలాది మంది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. దసరా ఉత్సవాల చివరి రోజైన విజయ దశమి ని పురస్కరించుకుని దేవస్థానం ప్రాంగణం లో శమీ పూజ నిర్వహించారు. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న అమ్మవారి మోడల్ టెంపుల్ లో తలుపులమ్మ అమ్మవారి ని ప్రత్యేక పూలతో విశేష అలంకరణ గావించారు. అదేవిధంగా తుని పట్టణం మెయిన్ రోడ్ లో గల తలుపులమ్మ అమ్మవారి ఆలయంలో తలుపులమ్మ తల్లి ని రాజరాజేశ్వరీ దేవి గా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శరన్నవరాత్రి మహోత్సవాల్లో 10 రోజులపాటు తలుపులమ్మ అమ్మవారు వివిధ అవతారాల్లో భక్తులకు దర్శనం ఇచ్చారని దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్. చంద్రశేఖర్ తెలిపారు. దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సహకరించిన వేదపండితులు అర్చకులు సిబ్బందిని అభినందించారు.

ఫోటో - http://v.duta.us/KDJR-AAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/_SkoXQAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬