Mahesh Babu లుక్‌పై ట్రోల్స్.. 'కాళ్ల మధ్య దూరం పెరుగుతోందంతే'!

  |   Tollywood

ఏళ్లు గడుస్తున్నా సూపర్ స్టార్ మహేశ్ బాబు వయసు మాత్రం తరగదు. సినిమా సినిమాకీ ఆయన వయసు తగ్గుతోందనే చెప్పాలి. అందుకే ఆయన నటించే సినిమాల నుంచి విడుదలయ్యే పోస్టర్లకు క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. అయితే దసరా సందర్భంగా మహేశ్ బాబు నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. కొండారెడ్డి బురుజు ముందు ఆర్మీ ప్యాంట్ వేసుకుని చేతిలో గొడ్డలి పట్టుకుని కోపంగా చూస్తున్నట్లుగా ఉన్న ఆ లుక్‌కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే అందరికీ మహేశ్ బాబు నచ్చాలని లేదు కదా.

అందుకే పోస్టర్లకు ఆయన ఇచ్చే పోజులను టార్గెట్ చేస్తూ కొందరు నెటిజన్లు ట్రోల్ చేశారు. మీరు బాగా గమనించినట్లైతే మహేశ్ బాబు సింగిల్ పోస్టర్లన్నీ దాదాపుగా ఒకే స్టిల్‌తో ఉంటాయి. ఆగడు, భరత్ అనే నేను, శ్రీమంతుడు, ఇప్పుడు రాబోతున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలోని పోస్టర్లలో మహేశ్ చేతిలో ఏదో ఒక వెపన్ పట్టుకుని ఒకే స్టిల్‌లో నిలబడి ఉంటాడు. దాంతో ఆయన ప్రతీ సినిమాలో ఒకే స్టిల్‌ ఇస్తున్నాడంటూ పలువురు నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. మహేశ్ సినిమాలో కేవలం దుస్తులు మారుస్తున్నారే తప్ప ఇతర హీరోల్లా కొత్తగా కనిపించేందుకు ప్రయత్నించడంలేదని అంటున్నారు....

ఫోటో - http://v.duta.us/w4dotwAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/I4BveQAA

📲 Get Tollywood on Whatsapp 💬