Syeraa కలెక్షన్స్: ఏడో రోజు ఎగిసింది.. డబుల్ సెంచరీ మిస్
వసూళ్లు ప్రభంజనం ఇంకా కొనసాగుతుంది. చిరంజీవి ఏ నమ్మకంతో అయితే ఈ సినిమా చేసారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ బాక్సాఫీస్ దగ్గర తన డ్రీమ్ రన్ కొనసాగిస్తుంది. ఆరో రోజు అయిన సోమవారం కలెక్షన్స్‌లో ఆదివారంకంటే కాస్త డ్రాప్ కనిపించినా కూడా మంగళవారం మాత్రం మళ్ళీ సైరా గ్రాఫ్‌లో చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. దసరా అడ్వాంటేజ్‌ని పూర్తిగా క్యాష్ చేసుకుంది సైరా. అందుకే ఓవరాల్‌గా ఈ సినిమా 12 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఏడో రోజు ఈ రేంజ్ కలెక్షన్స్ ఈ మధ్య కాలంలో బాహుబలికి తప్ప వేరే ఏ సినిమాకి కూడా సాధ్యం కాలేదు.
Also Read:
అయితే ఈ 12 కోట్లకు పైగా కలెక్దన్స్లో ఎక్కువభాగం మాత్రం తెలుగు వెర్షన్ నుండే వచ్చింది. దసరా రోజు ఉత్తరాంధ్రలో కోటిన్నర కి పైగా వసూళ్లు రాబట్టింది మెగాస్టార్ మాగ్నమ్ ఒపస్. దీంతో వారం మొత్తంలో 12.30 లక్షల షేర్ రాబట్టి బాహుబలి 2 తరువాతి స్థానంలో నిలిచింది. ఇక నెల్లూరులో మాత్రం సైరా విజృంభణ మాత్రం తగ్గడం లేదు. ఏడో రోజు అక్కడ పాతికలక్షలకు పైగా షేర్ రాబట్టింది. వారం మొత్తంలో 3 కోట్ల 90 లక్షల వరకు రాబట్టింది. అక్కడ బాహుబలి 2 కూడా 4 .50 కలెక్ట్ చేసింది. అంటే చాలా తక్కువ మార్జిన్‌తో సెకండ్ ప్లేస్‌లో నిలిచింది సైరా. ఇక నెల్లూరు సిటీలో మాత్రం వారానికే కోటిరూపాయలు రాబట్టి టాప్ ప్లేస్ దక్కించుకున్నాడు మెగాస్టార్. అక్కడ వారంలో కోటి రూపాయలు షేర్ రాబట్టిన ఏకైక సినిమా సైరా. సీడెడ్‌లో కూడా సూపర్ స్ట్రాంగ్‌గా రన్ అవుతుంది సైరా. మంగళవారం సీడెడ్‌లో 1.70 కోట్ల వసూళ్లు రాబట్టి 15 మార్క్‌ని టచ్ చేసింది. ఫుల్ రన్లో సైరా అక్కడ 20 కోట్ల మార్క్ అందుకోవడం ఖాయం అనిపిస్తుంది....
ఫోటో - http://v.duta.us/fgmlQQAA
పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/PzOF-gAA