Syeraa : బన్నీ చెప్పింది కిక్ ఇవ్వలేదు.. చరణ్‌కి అదే నా గిఫ్ట్
సైరా టీమ్ ఇప్పుడు పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. రిలీజ్‌కి ముందు దేశ వ్యాప్తంగా ఈ సినిమాని ప్రోమోట్ చేసిన చిరంజీవి ఇప్పుడు మాత్రం తెలుగు వెర్షన్‌ని వీలైనంతగా పుష్ చేస్తున్నారు. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా మీడియా మీట్ ఒకటి నిర్వహించారు. అయితే ఆ మీట్లో సైరా సినిమా రిలీజ్ రోజు తాను పడిన టెన్షన్ గురించి చాలా విషయాలు చెప్పుకొచ్చారు. అయితే దానికి సరయిన కారణం కూడా ఉంది. ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో రామ్ చరణ్ నిర్మించడం ఒక్కటే ఆ టెన్షన్‌కి కారణం కాదు, ఈ సినిమా కథపై చిరంజీవి పెంచుకున్న మమకారం, పెట్టుకున్న నమ్మకం కూడా మెయిన్ రీజన్స్.ఎంత మెగాస్టార్ అయినా కూడా రెండేళ్ల కష్టం బయటికి వస్తున్నప్పుడు ఆ మాత్రం భయం ఉండడం సహజమే కదా.
Also Read:
ఈ సినిమా రిలీజ్ రోజు అర్ధరాత్రి నుండి చిరంజీవి రెస్సాన్స్ కోసం వెయిటింగ్లో ఉన్నారట. ''మామూలుగా అయితే నాలుగు గంటలకు అమెరికా నుండి ఫోన్ వస్తుంది. రెండు మూడు ఫోన్ కాల్స్ రావాలి. అవి రాలేదు. దేవి శ్రీప్రసాద్ మాత్రం రాత్రి 12:30 కి ఒక వాయిస్ మెసేజ్ చేసాడు.అతను ఫారెన్‌లో ఉన్నాడు. ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయ్యింది, ఫెంటాస్టిక్ రిపోర్ట్ అని తన స్టైల్లో చెప్పాడు.సెకండ్ హాఫ్ చూడడానికి వెళుతున్నా అంటూ మెసేజ్ పెట్టాడు. అయితే మార్నింగ్ 3:30 , 4 అయ్యింది, అప్పటికి సెకండ్ హాఫ్ అయిపోయి ఉంటుంది. కానీ అతని నుండి నో మెసేజ్.4 గంటలకు రావాల్సిన ఫోన్ కాల్స్ రాలేదు. ఉదయం 6:30 అయ్యింది. ఎలాంటి మెసేజ్‌లు రాలేదు, ఎలాంటి ఫోన్స్ రాలేదు. ఎక్కడో చిన్న టెన్షన్, నా వైఫ్‌కి రావాల్సిన మెసేజ్‌లు కూడా రాలేదు. ఎక్కడ నుండి ఏ కాల్స్ రాలేదు. భారంగా పేపర్స్ తిరగేస్తున్నాం. సెకండ్ హాఫ్ చూసి డిసప్పాయింట్ అయ్యారా?.అంత హుషారుగా ఫస్ట్ హాఫ్‌కి ఫోన్ చేసిన దేవి శ్రీ ప్రసాద్ చెయ్యలేదేంటి?'' అంటూ సైరా రిలీజ్ రోజు ఉదయం తాను పడిన టెన్షన్‌ని పబ్లిక్ గా ఒప్పుకున్నారు....
ఫోటో - http://v.duta.us/JS4r9gAA
పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/fWfaJgAA