పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య......ఎమ్మెల్యే కొండేటి......

  |   Telugunews

అంబాజీపేట పేద విద్యార్థులకు సైతం కార్పొరేట్ విద్యను అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో ఆరో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంను ప్రవేశ పెట్టారని పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పేర్కొన్నారు. గురువారం మండలంలోని గంగలకుర్రు మెట్ల కాలనీలో ఎంఈఓ మోకా సుభాష్ బాబు అధ్యక్షతన మనబడి నాడు-నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం విద్య ఇంతవరకు అందని ద్రాక్షగా మిగిలిందని అయితే ముఖ్యమంత్రి ఎంతో సదుద్దేశంతో వారికి కూడా ఈ పోటీ ప్రపంచంలో మంచి విద్యను అందించాలనే ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెడితే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయన్నారు. విమర్శిస్తున్న నాయకుల కుమారులు, మనవలు గతంలో ఏ మీడియంలో చదివారని ఆయన ప్రశ్నించారు .అనంతరం పాఠశాల ఆవరణలో ప్రహరీ గోడ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా మండల అధ్యక్ష కార్యదర్శులు వాసంశెట్టి చిన బాబు,ఎన్. నాగరాజు, వైకాపా నాయకులు దొమ్మేటి సత్యమోహన్ బూడిద వరలక్ష్మి కొర్లపాటి కోట బాబు ,పితాని కాళి, పేరి శ్రీనివాస్,ఉందుర్తి నాగబాబు, రాయుడు కృష్ణ మహేష్,పితాని రమణ తదితరులు పాల్గొన్నారు.

ఫోటో - http://v.duta.us/w6kT0QAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/tep6eQAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬