ప్లాస్టిక్ వ్యర్ధాలతో అనర్ధాలు

  |   Telugunews

మైలవరం - ప్లాస్టిక్ వ్యర్ధాలతో ఎన్నో అనర్ధాలు చోటు చేసుకుంటాయని మైలవరం పంచాయతీ కార్యదర్శి ఎం.డి.రఫీ అన్నారు.గురువారం స్థానిక రాక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడపబడుతున్న ఉర్దూ స్కూల్(మదర్స్)విద్యార్థులు భారత తొలి ప్రధాని పండిత నెహ్రు జయంతిని పురస్కరించుకుని బాలల దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కొరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు.నూజివీడు రోడ్డులోని జెండా చెట్టు వద్ద నుండి బోసుబొమ్మ సెంటర్ వరకు ప్లాస్టిక్ నిరోధిచాలి-పర్యావరణాన్ని కాపాడాలి అంటూ ప్లకార్డులను చేతపట్టి నినాదాలు చేశారు. అనంతరం బోసుబొమ్మ సెంటర్లో మానవహారం నిర్వహించారు.ఈ సందర్భంగా కార్యదర్శి రఫీ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం వలన వాతావరణం కలుషితమై జీవరాసి మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదం నెలకొందన్నారు.ప్లాస్టిక్ నిరోధానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అంతకుముందు దేశంలో శాంతి నెలకొనాలని,ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ కపోతాలను ఎగురవేశారు.ఈ కార్యక్రమంలో రాక్ ఫౌండేషన్ ట్రస్ట్ ట్రెజరర్ ఎం.డి.ఖాజా,ఎం.డి.జానీ,మాజీ ఎంపీటీసీ సభ్యుడు అబ్దుల్ రహీం,శుభాని,ముస్లిం మత పెద్దలు,ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఫోటో - http://v.duta.us/h0UrwgAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/q5yPIQAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬