ముగిసిన చంద్రబాబు ఇసుక దీక్ష - జగన్ పై విమర్శల జడివాన..

  |   Telugunews

విజయవాడ - ఎపిలో ఇసుక కార్మికుల సమస్య పరిష్కరించాలని కోరుతూ విజయవాడ ధర్నా చౌక్ లో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన 12 గంటల ఇసుక దీక్ష నేటి రాత్రి 8 గంటలకు ముగిసింది.. భవన నిర్మాణ రంగ కార్మికులు ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ జగన్ పై విమర్శలు చేస్తూ, మరో వైపు వైరాగ్యంగా మాట్లాడారు.. 'నాకు అధికారం వద్దు..పదవులు వద్దు...14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశా..సమైక్య రాష్ట్రంలో అందరికంటే ఎక్కువగా ప్రతిపక్ష నేతగా పనిచేశా..నాకు ఇంకా పదవి కావాలా' ? అంటూ ప్రశ్నించారు. రాష్ట్రాన్ని జగన్ దోపిడి చేయాలని చూస్తున్నారని, సామాన్యుడికి ఇసుక దొరక్కుండా వైసీపీ నేతలు దోచుకున్నారని ఆరోపించారు. ప్రతి పనిలో మీకు జే ట్యాక్స్‌ కావాలా అని నిలదీశారు. ఇసుక దోచుకోవడానికి జగన్‌ మనుషుల్ని పెట్టారని ఆరోపించారు. సిమెంట్‌ కంపెనీలను కూడా బెదిరించారని, నెల రోజుల్లోపు సిమెంట్‌ ధర రూ.110 పెంచడం ఎప్పుడైనా చూశామా అని మరోసారి ప్రశ్నించారు. జగన్‌కి డబ్బులిస్తే రాష్ట్రాన్ని లూటీ చేసినా పర్వాలేదని సిమెంట్‌ కంపెనీలు అనుకుంటున్నాయని తెలిపారు. నిర్మాణ రంగంలో ఎవరికీ పనిలేకుండా పోయిందని, కార్మికులు అర్థ ఆకలితో అలమటిస్తుంటే సీఎం మాత్రం నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారని ధ్వజమత్తారు. మద్యాన్ని నియంత్రించాల్సిన పోలీసులే మద్యం అమ్మకాల్లో బిజీ అయిపోయారని చంద్రబాబు విమర్శించారు. పేద వాడు నాశనమైనా ఫర్వాలేదు..కేవలం డబ్బుల కోసమే ఇసుక కొరత సృష్టించారని విమర్శించారు. హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు ఇసుక తరలిస్తున్నారని, వేరే రాష్ట్రాలకు పంపిస్తుంటే భవన నిర్మాణాలను వాయిదాలు వేసుకోవాలా అని ప్రశ్నించారు. కృతిమ ఇసుక ద్వారా 40 నుంచి 50 మంది ప్రాణాలు తీశారని, ఎన్నో లక్షల మంది అర్థాకలితో అలమటిస్తున్నారని తెలిపారు. మృతి చెందిన భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల బాధ చూసి చలించిపోయానన్నారు. తనపై కక్షతోనే పేదలను బాధ పెడుతున్నారని, తప్పు చెబితే..తనపై దాడి చేస్తారా ? ఒక్క నాయకుడు పోతే..ఏంటీ..వంద మంది నాయకులు తయారు చేస్తామని తమ పార్టీకి చెందిన నేతలు అంటున్నారని, ఇటీవలే పార్టీ నుంచి వెళుతున్న లీడర్స్ గురించి వ్యాఖ్యానించారు. బాబాయ్‌ని చంపిన వ్యక్తి ఇంతవరకు పట్టుకోలేదని, ఇక ప్రజల గురించి ఏం ఆలోచిస్తారని బాబు ప్రశ్నించారు.

ఫోటో - http://v.duta.us/g99_QwAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/HjLxbAAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬