అర్హులైన ప్రతీ ఒక్కరికి ఓటుహక్కు కల్పించాలి

  |   Telugunews

మార్కాపురం: అర్హులైన ప్రతీ ఒక్కరికి ఓటుహక్కు కల్పించే బాధ్యత బిఎల్‌ఓలపై ఉందని తహసీల్దార్‌ సిహెచ్‌ రమేష్‌ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక విశ్రాంత ఉద్యోగుల భవనంలో బిఎల్‌ఓలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ స మావేశంలో తహసీల్దార్‌ మాట్లాడుతూ ఎన్నికల కమీషన్‌ ఓటర్ల నమోదు, మార్పులు - చేర్పుల కొరకు ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించడం జరిగిందని అందులోనే ఓటర్ల వివరాలు నమోదు చేయాల్సి ఉంటుందని బిఎల్‌ఓలకు సూచించారు. యాప్‌ను ఉపయోగించే విధానంపై అవగాహన కల్పించారు. కుటుంబాలను యూనిట్లుగా రూపొందించి వారి వివరాలను యాప్‌లో సంక్షిప్తంగా పొందుపర్చాలని సూచించారు. ఓటు నమోదు కోసం ప్రతీ ఇంటికి వెళ్లి వారి వివరాలను సేకరించి అర్హులైన వారికి ఓటుహక్కు కల్పించే విధంగా కృషి చేయాలని కోరారు. గ్రామ, వార్డు వాలంటీ ర్లు, సచివాలయ ఉద్యోగులను సమన్వయం చేసుకుని ఖచ్చితమైన ఓటర్లవివరాలను యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. వలస వాసులు, వికలాంగులు, గిరిజన తెగలు, నిర్వాసితులు, ట్రాన్స్‌జెండర్స్‌ మొదలైన వారికి ఓటు హక్కుపై అవగాహన కలిగేలా విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ నాగార్జునరెడ్డి, ఆర్‌ఐలు ఫిరోజ్‌భాష, గోపి, విఆర్‌ఓలు ఇండ్లా చలమారెడ్డి, యం.చలమారెడ్డి, మునిరెడ్డి, నాగరాజ కుమారి, మౌనిక, బిఎల్‌ఓలు పాల్గొన్నారు.

ఫోటో - http://v.duta.us/xITSugAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/7GeuZgAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬