ఆలిండియా అంగన్ వాడి మహాసభలను విజయవంతం చేయాలి

  |   Telugunews

తుని : రాజమహేంద్రవరంలో ఆల్ ఇండియా అంగన్ వాడి మహాసభలు ను విజయవంతం చేయాలని అంగన్వాడీ సిబ్బంది తుని లో భారీ ప్రదర్శన నిర్వహించారు. అంతకు ముందు ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట జెండాను ఆవిష్కరించారు. ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్, సిఐటియు ఆధ్వర్యంలో ఈనెల 17 నుంచి 20వ తేదీ వరకు నాలుగు రోజులపాటు రాజమహేంద్రవరం లో అంగన్వాడి 9వ అఖిల భారత మహాసభలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి అంగన్వాడీ సిబ్బంది పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. మాతాశిశు సంరక్షణ కోసం అంగన్వాడీ సిబ్బంది చేస్తున్న కృషి , ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాల్లో భాగస్వామ్యం కావడం వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టినప్పటికీ అంగన్వాడీ సిబ్బంది పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నారని, అంగన్వాడీ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలపై అఖిలభారత మహాసభల్లో సమగ్రంగా చర్చిస్తామని యూనియన్ నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో యూనియన్ నాయకులు వై. ధనలక్ష్మి , ఆర్. సుబ్బలక్ష్మి , జె.లలిత, ఆర్. ఉమామహేశ్వరి, ఎం. మాధవి, ఆర్. దుర్గ కుమారి,...

ఫోటో - http://v.duta.us/HuP_kAAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/0urK3AAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬