జి.ఓ.132ను వెంటనే అమలు చేయాలి

  |   Telugunews

వేటపాలెం, గ్రామ పంచాయితీ కార్మికులకు ఇచ్చిన జివో నం.132ను వెంటనే అమలు చేయాలని సి ఐ టి యు జిల్లా అద్యక్షులు కె. శ్రీనివసారావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మండల పంచాయితీ కార్మికుల మహాసభ మండల అద్యక్షులు టి.ప్రభాకారరావు అద్యక్షతన జరిగింది . ఈ సభకు ముఖ్య అతిదిగా విచ్చేసిన శ్రీనివాసరావు మాట్లాడుతూ పంచాయితీ కార్మికులకు పి.యఫ్‌, ఇయస్‌, సౌకర్యాలు, ప్రతినెలా 5వతేదీన జీతాలు చెల్లించాలని డిమాండ్‌ చేఉశారు. మండల కార్యదర్శి ఎవి రమణ మాట్లాడుతూ కోర్కెల సాధనకు కమిటి ఏర్పాటు చేసికొని ఐక్యంగా పోరాడాలని పిలుపు నిచ్చారు. ఈ సందర్బంగా కమిటికి అద్యక్షులుగా చోప్పరపు రంగయ్య, ఉపాద్యక్షులుగా పౌలు, దావీదు, ప్రసన్న, కత్తి మహాలక్ష్మి, కార్యదర్శిగా సీతారామయ్య, సహాయ కార్యదర్శిగా పుట్టా వెంకటేశ్వర్లు, దానియేలు, కోశాదికారిగా ఎవి రమణ, కమిటిసభ్యులు చేవూరి ఆంజనేయులు, ముగ్గురు కోఆప్షన్‌ సభ్యులు ఏకగ్రావంగా ఎన్నికయ్యారు. డిసెంబరు 15న జరిగే రాష్ట్ర మహాసభకు, జనవరి 8న జరిగే అఖిల భారత కార్మిక సమ్మెను జయప్రదం చేయాలి తీర్మానాలు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో వేటపాలెం, రామన్నపేట, దేశాయిపేట పందిళ్లపల్లి తదితర గ్రామపంచాయితీలకు చెందిన కార్మికులు పాల్గొన్నారు.

ఫోటో - http://v.duta.us/ZOCyjgAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/Mn1_VAAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬