టిటిడి నిర్ణయాలు భక్తులకు శాపం ..

  |   Telugunews

మండపేట:- తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఇటీవల కాలంలో తీసుకుంటున్న నిర్ణయాలు భక్తుల పాలిట శాపంగా మారాయని ఏఐసీసీ సభ్యులుకామన ప్రభాకరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.మండపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రపంచంలోని ప్రజలు అందరికీ ఆరాధ్య దైవం అన్నారు.అటువంటి శ్రీ వెంకటేశ్వరస్వామి ని టిటిడి బోర్డు పూర్తిగా వ్యాపారం గా చేయడం దారుణమని పేర్కొన్నారు. తిరుమల కొండపై గదులు అద్దె రెట్టింపు చేయడం సరికాదన్నారు. సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకుని ధర నిర్ణయం ఉండాలన్నారు. స్వామివారి లడ్డూ ప్రసాదం ప్రపంచంలోనే గొప్ప ఖ్యాతి గడించిందన్నారు. సామాన్య ప్రజలు స్వామివారి లడ్డూ ప్రసాదం కొనుగోలు చేసి వారి బంధువులకు స్నేహితులకు ప్రసాదాన్ని తము స్వామివారి దర్శనానికి వెళ్ళమని చెప్పి ప్రసాదం ఇవ్వడం వారు దాన్ని స్వీకరించడం గొప్ప అనుభూతిగా వ్యవహరిస్తూ ఉంటారన్నారు. అటువంటి శ్రీవారి లడ్డూ ప్రసాదం రేటు రెట్టింపు చేయడం భావ్యం కాదన్నారు. లడ్డూ సబ్సిడీల వల్ల దేవస్థానానికి నష్టం వస్తున్నట్లు టిటిడి చెప్పడం చూస్తూ ఉంటే అది ఒక ధార్మిక సంస్థ లేదా వ్యాపార సంస్థ అనే అనుమానాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు. టిటిడి లో జరుగుతున్న అవినీతి అక్రమాలను అరికట్టి స్వామి వారి ఆస్తులను కాపాడాలని,ధరలు తగ్గించి భక్తులకు స్వామివారిని దర్శించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని హితవుపలికారు.

ఫోటో - http://v.duta.us/2XIGaAAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/F4ukpQAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬