తాండవ నదిలో ఇసుక ర్యాంప్ లు ప్రారంభం

  |   Telugunews

తుని : నియోజకవర్గంలో ఇక ఇసుక కొరత ఉండదని తుని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా స్పష్టం చేశారు. ఇసుక వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం తుని మండలం నందివంపు వద్ద తాండవ నదిలో ఇసుక ర్యాంప్ లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా మాట్లాడుతూ నదులకు వరదలు రావడం వల్లే ఇసుక కొరత ఏర్పడిందని, నదుల్లో నీటి ప్రవాహం తగ్గడంతో ఇసుక అందుబాటులోకి వచ్చిందన్నారు. తాండవ నదిలో మూడు రీచ్ లను అధికారికంగా ఏర్పాటు చేస్తున్నామని ఇక నుంచి ఇసుక కొరత అనేది ఏర్పడదని ఆయన స్పష్టం చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ మరింత పెరిగిందన్నారు. దీంతో ఆందోళన చెందిన టిడిపి శ్రేణులు ఇసుక పై రాద్ధాంతం చేస్తూ ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇసుక ర్యాంప్ లపై అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని స్పష్టం చేసిన ఆయన, చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే ఇసుక మాఫియా చెలరేగి పోయిందని దుయ్యబట్టారు. తాండవ నదిలో ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, ఎటువంటి యంత్రాలను వినియోగించకుండా కార్మికుల ద్వారా, ట్రాక్టర్లలో ఇసుక సరఫరా చేయడం జరుగుతుంది ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం లో తహసిల్దార్ శ్రీ పల్లవి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మోతుకూరు వెంకటేష్ , ఏలూరి బాలు, పోతల రమణ, రేలంగి రమణ గౌడ్, పోతుల లక్ష్మణ్, ఎస్.కె. క్వాజా, అనిశెట్టి సూర్య చక్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఫోటో - http://v.duta.us/I13WEwAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/P-yylAAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬