దోమల నివారణకు సహకరించాలి

  |   Telugunews

కందుకూరు : పట్టణంలో ప్రబలుతున్న విషజ్వరాలకు మూలకారణమైన దోమలను నియంత్రించడానికి పురపాలక సంఘం చేపడుతున్న చర్యలకు ప్రజలు సహకరించాలని మునిసిపల్‌ కమీషనర్‌ యస్‌.మనోహర్‌ విజ్ఞప్తిచేశారు. పట్టణంలోని పారిశుధ్య పరిస్థితులను మెరుగుపరిచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. డ్రైనేజీ కాలువల్లోనూ, నీటి గుంటల్లోనూ ఆయిల్‌ బాల్స్‌ వంటివి వేసి దోమల లార్వాను నాశనం చేసేందుకు కృషిచేస్తున్నట్లు చెప్పారు. అయితే ఖాళీ ప్రదేశాల్లో విపరీతంగా పెరిగిన పిచ్చిమొక్కలు దోమల ఆవాస కేంద్రాలుగా ఉంటాయని కమీషనర్‌ తెలిపారు. అందువలన దోమల నియంత్రణ కష్టసాధ్యం అవుతుందని అన్నారు. ప్రభుత్వ స్థలాలు, రోడ్డు పక్కన పెరిగిన పిచ్చిమొక్కలను తొలగించేందుకు పురపాలక యంత్రాంగం ఇప్పటికే చర్యలు చేపట్టిందని అన్నారు. అయితే పట్టణంలో ఖాళీగా ఉన్న అనేక ప్రైవేటు స్థలాల్లో కూడా పిచ్చిమొక్కలు విపరీతంగా పెరిగి ఉన్నాయని అన్నారు. వాటిని వెంటనే తొలగించేలా సంబంధిత స్థలాలకు చెందిన యజమానులు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తిచేశారు. దోమల నివారణకోసం మునిసిపల్‌ యంత్రాంగం చేస్తున్న కృషికి వారంతా సహకరించాలని కోరారు. పట్టణంలో ఇప్పటికే గుర్తించిన ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులు జారీచేస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా ప్రైవేటు స్థలాల యజమానులందరూ తమ ఖాళీ స్థలాల్లోని పిచ్చిమొక్కలను వెంటనే తొలగించి దోమల నివారణకు తమవంతు చేయూతనివ్వాలని కోరారు. పురపాలక సంఘం విజ్ఞప్తిని, నోటీసులను ఖాతరుచేయని ప్రైవేటు స్థలాల యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఫోటో - http://v.duta.us/DEXT7gAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/nAJDCwAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬