పొగాకు సాగు తగ్గించి అన్యపంటలు సాగు చేయండి

  |   Telugunews

పొదిలి : పొగాకు సాగు తగ్గించి అన్య పంటలను సాగు చేయాలని పొదిలి పొగాకు వేలం కేంద్రం సీనియర్‌ గ్రేడింగ్‌ అధికారి కె.వి.ఎస్‌ ప్రసాద్‌ తెలిపారు. పొదిలి పొగాకు బోర్డు పరిధిలోని సిద్దవరం గ్రామంలో పొగాకు పంట నియంత్రణపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ... అధిక విస్తీర్ణంలో పొగాకు సాగు చేయడం వలన నష్టం ఎక్కువగా సంభవించే అవకాశం ఉందని కావున సాగు ఖర్చులు, పొగాకు ఖర్చులు తగ్గించుకుని లాభదాయకమైన ఇతర పంటలు, మిశ్రమ పైర్లు సాగు చేసుకుని రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని కోరారు. నీటి వసతి కలిగిన రైతులు కొద్దిపాటి పొలాన్ని 365 రోజులు వివిధ రకాల కూరగాయలు, పంటలు పండేలా ప్రణాలిక రూపొందించుకోవాలని, సంవత్సరం అంతా ఆదాయం పొందేలా చూసుకోవాలని కోరారు.  ఐటిసి డెవలప్‌మెంట్‌ మేనేజర్‌ బి.వెంకటరావు మాట్లాడుతూ నాణ్యమైన దిగుబడి వచ్చేలా పలు సూచనలు చేశారు. పిఎస్‌ఎస్‌హెచ్‌ కంపెనీ టీమ్‌ లీడర్‌ మాట్లాడుతూ పురుగుల మందుల అవశేషాలు లేని పొగాకును పండించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్షేత్రాధికారులు బి.శ్రీహరి, సిహెచ్‌ రాఘవరెడ్డి, క్షేత్రసిబ్బంది పాల్గొన్నారు.

ఫోటో - http://v.duta.us/D4AbRwAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/S29WbAAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬