పుస్తకాలు .....పాఠకులకు ప్రియ నేస్తాలు.......

  |   Telugunews

అంబాజీపేట: గ్రంథాలయాలలో ఉండే పుస్తకాలన్నీ పాఠకులకు ప్రియ నేస్తాలని విశ్రాంత గ్రంథాలయ అధికారి మట్టపర్తి వీర వెంకట సత్యనారాయణ అన్నారు.52 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా స్థానిక గ్రంథాలయంలో లో శుక్రవారం పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు.గ్రంథాలయ అధికారి జి. శ్రీనివాస్ నిర్వహించిన ఈ పుస్తక ప్రదర్శనను ఎంతోమంది పాఠకులు ఆసక్తిగా తిలకించారు. ఈ పుస్తకాలలో ఎంతో విలువైన ఆధ్యాత్మిక, రాజకీయ ,సామాజిక, అంశాలు కలిగిన పుస్తకాలు,తో పాటు విద్యార్థులకు అవసరమయ్యే పోటీ పరీక్షల పుస్తకాలు ఉన్నాయి. వీటిని తప్పనిసరిగా ప్రతి ఒక్కరు చదివి విజ్ఞానాన్ని సంపాదించుకోవాలని విశ్రాంత గ్రంథాలయ అధికారి సత్యనారాయణ సూచించారు. ముఖ్యంగా నేటి యువత సమాజంలో స్మార్ట్ఫోన్లు, వీడియో గేములు,టిక్ టాక్ , తదితర అనవసరమైన పనికిరాని వ్యా పకాలతో వారి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్క విద్యార్థిని గ్రంథాలయానికి పంపి పుస్తక పఠనం అలవాటు చేసే బాధ్యత తల్లిదండ్రులదేనని సత్యనారాయణ తెలిపారు. పుస్తక ప్రదర్శనలో సమాచార హక్కు చట్ట సభ్యుడు వీరిన గోపాలం, గ్రంథాలయ సిబ్బంది విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఫోటో - http://v.duta.us/cUVWqAAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/blccAQAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬