ఫ్లెక్సీ లపై చర్యలు తీసుకోవాలి

  |   Telugunews

మండపేట : మండపేట పట్టణంలో ఇబ్బడి ముబ్బడిగా ఉన్న ఫ్లెక్సీ లను తక్షణమే తొలగించి కోర్ట్ ఉత్తర్వులు అమలు చేయాలని జనసేన నియోజకవర్గ కన్వీనర్ వేగుళ్ళ లీలా కృష్ణ డిమాండ్ చేశారు. మండపేట మునిసిపాలిటీ లోని కమిషనర్ ఛాంబర్ లో శుక్రవారం కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్ కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ప్లెక్సీ ల పై తమిళనాడు హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన పట్టించుకోకుండా ఉండటం దారుణంగా ఉందని మండిపడ్డారు.దీనిపై తాను సమాచార హక్కు చట్టం ద్వారా మునిసిపాలిటీ కి దరఖాస్తు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. దీనిపై తాను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ను ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు.చట్టాలు అమలు చేసే అధికారులు నిమ్మకు నిరెత్తే వ్యవహార శైలి ప్రదర్శించడం తగదని హితవు పలికారు. రాజకీయ ఓత్తిళ్ల కు తలొగ్గితే చట్టం అధికారులను శిక్షిస్తుందన్నారు.తక్షణమే పట్టణంలో బోర్డులు తొలగించి ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో ప్రజా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. దీనిపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు.

ఫోటో - http://v.duta.us/oir8JwAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/HrElhAAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬